Bihar: షాకింగ్.. పిల్లలు లేని మహిళల్ని తల్లుల్ని చేసే జాబ్ ఉందని చెప్పి మగాళ్లను..
ABN , Publish Date - Dec 31 , 2023 | 07:09 PM
బీహార్‌లో ఓ షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని మహిళల్ని తల్లుల్ని చేసే ఉద్యోగం పేరిట ఓ ముఠా అనేక మంది మోసగించి భారీగా డబ్బు దండుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో (Bihar) ఓ షాకింగ్ స్కామ్ (Job Scam) వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని మహిళల్ని తల్లుల్ని చేసే ఉద్యోగం పేరిట ఓ ముఠా అనేక మందిని మోసగించి భారీగా డబ్బు దండుకుంది. సోషల్ మీడియా వేదికగా అమాయకులకు వల వేసి అందిన కాడికి దోచుకుంది. ఈ గ్యాంగ్‌కు చెందిన ఎనిమిది మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లు నిర్వహిస్తూ నిందితులు మగాళ్లను బుట్టలో వేసుకునే వాళ్లని తెలిపారు.
Photoshoot: స్టూడెంట్‌తో వివాదాస్పద ఫొటో షూట్..తమ బంధం ఎలాంటిదో చెప్పిన టీచర్!
తమ మాటలు నమ్మిన అమాయకుల నుంచి తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట రూ.799, ఆ తరువాత సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట రూ.5 వేల నుంచి 20 వేల వరకూ దండుకునే వారని తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి నవాడా ప్రాంతంలోని మున్నా కుమార్ అనే నిందితుడి ఇంట్లో రెయిడ్లు జరిపాయి. అనంతరం మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాయి.
Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?
ఈ స్కామ్ వెనక ప్రధాన పాత్రధారి మున్నా కుమార్‌యేనని పోలీసులు భావిస్తున్నారు. ఇతర నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి తొమ్మిది స్మార్ట్ ఫోన్లు, ఓ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ స్కామ్ దేశవ్యాప్తంగా జరుగుతోందని తాము భావిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని, త్వరలో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్ పెట్టి చూసుకుంటే.. దారుణం..
Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!