ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: పెళ్లి కూతురిని అలా అడిగినందుకు ఆగ్రహం.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-06-18T19:18:39+05:30

వరుడు కోరిన చిన్న కోరిక వధువుకు ఆగ్రహం తెప్పించింది.. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది.. ఘర్షణకు దారి తీసింది.. దీంతో వరుడిని, అతడి స్నేహితులను వరుడి తరఫు వారు చెట్టుకు కట్టేశారు.. ఆ వీడియోను వైరల్ చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుడు (Groom) కోరిన చిన్న కోరిక వధువు (Bride)కు ఆగ్రహం తెప్పించింది.. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది.. ఘర్షణకు దారి తీసింది.. దీంతో వరుడిని, అతడి స్నేహితులను వరుడి తరఫు వారు చెట్టుకు కట్టేశారు (Groom tied to tree).. ఆ వీడియోను వైరల్ చేశారు.. చివరకు వివాహం రద్దైంది.. పెళ్లికి ఖర్చైన డబ్బుల కోసం వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హరఖ్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ సింగ్ అనే యువకుడికి వివాహం (Marriage) నిశ్చయమైంది. శుక్రవారం తన పరివారంతో కలిసి రామ్ సింగ్ వధువు ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి కార్యక్రమాలు సందడిగా మొదలయ్యాయి. వధూవరులు దండలు మార్చుకున్న తర్వాత బంధుమిత్రులు వారితో ఫొటోలు దిగారు. ఆ సమయంలో వరుడి స్నేహితులు వేదిక ఎక్కారు. అందరూ కళ్లజోళ్లు (Goggles) పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో గాగుల్స్ ధరించాలని వధువును వరుడు కోరాడు. అందుకు వధువు నిరాకరించింది.

Viral Video: నైట్ క్లబ్‌లో కోతితో క్రూరత్వం.. గొలుసు కట్టి బంధించారు.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం..!

వరుడు ఊరుకోకుండా గాగుల్స్ ధరించాల్సిందిగా వధువుపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా వధువు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. వెంటనే పెద్దలు జోక్యం చేసుకున్నప్పటికీ ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వధువు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి వరుడిని, అతడి స్నేహితులను చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెళ్లి రద్దు చేసుకున్నారు. పెళ్లి కోసం వధువు తండ్రి ఖర్చు పెట్టిన రూ.7 లక్షలు చెల్లించడానికి వరుడి తండ్రి అంగీకరించాడు.

Updated Date - 2023-06-18T19:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising