Viral Video: నైట్ క్లబ్‌లో కోతితో క్రూరత్వం.. గొలుసు కట్టి బంధించారు.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం..!
ABN , First Publish Date - 2023-06-18T16:49:02+05:30 IST
కోల్‌కతాలోని ఓ నైట్‌క్లబ్‌లో కోతి పట్ల క్రూరంగా వ్యవహరించారు. నైట్ క్లబ్ లోపల కోతిని గొలుసులతో బంధించి పార్టీ చేసుకున్నారు. కామిక్ కాలనీ ప్రాంతంలో ఉన్న క్లబ్ టాయ్ రూమ్‌లో నిర్వాహకులు ఈ నెల 16వ తేదీన సర్కస్ థీమ్‌తో కూడిన పార్టీని ఏర్పాటు చేశారు.
కోల్‌కతా (Kolkata)లోని ఓ నైట్‌క్లబ్ (Nightclub)లో కోతి (Monkey) పట్ల క్రూరంగా వ్యవహరించారు. నైట్ క్లబ్ లోపల కోతిని గొలుసులతో బంధించి పార్టీ చేసుకున్నారు. కామిక్ కాలనీ ప్రాంతంలో ఉన్న క్లబ్ టాయ్ రూమ్‌లో నిర్వాహకులు ఈ నెల 16వ తేదీన సర్కస్ థీమ్ (Circus theme)తో కూడిన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ థీమ్‌కు అనుగుణంగా ఓ కోతిని నైట్ క్లబ్ ప్రాంగణంలో కట్టేసి ఉంచారు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఆ వైరల్ వీడియోపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు (Monkey chained at Kolkata nightclub).
తమ సంతోషం కోసం మూగ జీవాలను హింసించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్లు చేశారు. దీంతో అటవీ శాఖ స్పందించింది. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు సదరు నైట్ క్లబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బెంగాలీ నటి శ్వస్తికా ముఖర్జీ కూడా స్పందించారు. నైట్ క్లబ్ నిర్వాహకులు, పార్టీకి వెళ్లిన వారు ఆ కోతి పట్ల నిర్దయగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో నైట్ క్లబ్ నిర్వాహకులు స్పందించారు.
Viral Video: తుపాకీతో మొబైల్ కొందామనుకున్నాడు.. షాప్ ఓనర్ బిల్ సెటిల్ చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!
నైట్‌క్లబ్‌లోకి ఎలాంటి కోతులను అనుమతించలేదని తెలిపారు. కోతులు ఆడించుకునే వ్యక్తులు క్లబ్‌లోకి వెళ్లాలనుకున్నారని, వారికి అనుమతి నిరాకరించడంతో రెస్టారెంట్ ప్రాంగణంలో తమ కోతులతో పాటు కొద్ది సేపు ఉన్నారని క్లబ్ యాజమాన్యం తెలిపింది. తమ క్లబ్ ప్రాంగణంలో కోతులకు ఎలాంటి హానీ కలుగ చేయలేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేసింది.