Viral Video: తుపాకీతో మొబైల్ కొందామనుకున్నాడు.. షాప్ ఓనర్ బిల్ సెటిల్ చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2023-06-18T16:23:47+05:30 IST

ఆ వ్యక్తి మొబైల్ కొనడానికని షాప్‌నకు వెళ్లాడు.. మంచి బ్రాండ్ మొబైల్ చూశాడు.. అయితే అతడి దగ్గర డబ్బులు లేవు.. తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ బయటకు తీసి షాప్ సిబ్బందిని బెదిరించాలని చూశాడు.. కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి బిల్ సెటిల్ చేశాడు..

Viral Video: తుపాకీతో మొబైల్ కొందామనుకున్నాడు.. షాప్ ఓనర్ బిల్ సెటిల్ చేశాడు.. వైరల్ అవుతున్న వీడియో!

ఆ వ్యక్తి మొబైల్ (Mobile) కొనడానికని షాప్‌నకు వెళ్లాడు.. మంచి బ్రాండ్ మొబైల్ చూశాడు.. అయితే అతడి దగ్గర డబ్బులు లేవు.. తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ (Gun) బయటకు తీసి షాప్ సిబ్బందిని బెదిరించాలని చూశాడు.. కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి బిల్ సెటిల్ చేశాడు.. తుపాకీతో ఆ వ్యక్తి పొట్టలో కాల్చాడు.. ఆ ఘటన షాప్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది.

@cctvidiots అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మొబైల్ షాప్‌లోకి వెళ్లి వారిని బెదిరిద్దామనుకున్నాడు. మొబైల్ సెలెక్ట్ చేసుకుని డబ్బులు ఇవ్వకుండా చంపేస్తానని బెదిరించి వెళ్లిపోదామనుకున్నాడు. అయితే విధి ఎదురు తిరిగింది. కౌంటర్ దగ్గర కూర్చున్న దుకాణదారుడు గన్ తీసి ఆ వ్యక్తి పొట్టలోకి కాల్చాడు. దీంతో ఆ వ్యక్తి వెంటనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మొత్తం షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.

Viral Video: మెట్రో రైళ్లలో ఎందుకిలా? డ్యాన్స్‌లు కాదు.. ఈ అమ్మాయి ఏం చేస్తోందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా మళ్లీ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.1 కోట్ల మంది వీక్షించారు. 51 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తగిన బుద్ధి చెప్పిన షాప్ యజమానిని ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-06-18T16:23:47+05:30 IST