ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Google: అలర్ట్.. గూగుల్ కీలక నిర్ణయం! మీకు ఒకటికంటే ఎక్కువ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే..

ABN, First Publish Date - 2023-11-12T18:32:37+05:30

మీకు ఒకటికి మించి జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయా? వాటిల్లో కొన్ని వాడక చాలా కాలం గడిచిపోయిందా? అయితే మీకో అలర్ట్.

ఇంటర్నెట్ డెస్క్: మీకు ఒకటికి మించి గూగుల్ అకౌంట్లు ఉన్నాయా? వాటిల్లో కొన్ని వాడక చాలా కాలం గడిచిపోయిందా? అయితే మీకో అలర్ట్. త్వరలో మీ అకౌంట్ డిలీట్ కావచ్చు. ఇలా నిరుపయోగంగా పడి ఉన్న అకౌంట్లను స్వయంగా గూగుల్ డిలీట్ చేయనుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రుత్ కిర్చెల్లీ ఓ బ్లాగులో పేర్కొన్నారు. నిరర్ధక అకౌంట్ల తొలగింపు ప్రక్రియను డిసెంబర్ నుంచీ ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు సంస్థ అకౌంట్ ఇనాక్టివిటీ పాలసీకి మార్పులు చేసినట్టు చెప్పారు.

Longest Car: భలే కారు.. లోపల స్విమ్మింగ్ పూల్.. హెలికాఫ్టర్ దించేందుకు హెలీ ప్యాడ్..


కనీసం రెండేళ్ల పాటూ ఓ యూజర్ తన గూగుల్ అకౌంట్లోకి లాగిన్ కాకపోతే ఆ అకౌంట్‌ను గూగుల్ డిలీట్ చేసే అవకాశం ఉంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ వంటి ఉత్పత్తుల్లో యూజర్ భద్రపరుచుకున్న సమాచారం మొత్తం తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. పాత అకౌంట్లతో భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ చెబుతోంది. పాత అకౌంట్లకు రెండంచెల పాస్ వర్డ్ వ్యవస్థ (టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్) ఉండే అవకాశం తక్కువని, అకౌంట్ భద్రతపై యూజర్ దృష్టి సారించడని గూగుల్ చెబుతోంది. ఫలితంగా, ఈ అకౌంట్లకు భద్రతా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉక్కువగా ఉందని తెలిపింది. ఒకసారి అకౌంట్‌కు సమస్య వస్తే అందులో సమాచారం ఆధారంగా నిందితులు సైబర్ నేరాలకు ఒడిగట్టే అవకాశం ఉందని చెప్పింది.

Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


అకౌంట్ డిలీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా గూగుల్ చెప్పింది. పాత అకౌంట్లలో యూజర్లు కనీసం రెండేళ్ల కొకసారి అన్నా లాగిన్ అయితే ఈ ప్రమాదం ఉండదని చెప్పింది. అయితే, ఈ డిలీషన్ పాలసీ వ్యక్తిగత అకౌంట్లకే వర్తిస్తుందని, స్కూళలు, సంస్థలకు చెందిన అకౌంట్లతో ఈ ప్రమాదం లేదని పేర్కొంది.

Wife: నువ్వు చెప్పిందంతా అబద్ధం.. ఏం జరిగిందో నిజం చెప్పమంటూ చావుబతుకుల్లో ఉన్న భార్యను పోలీసులు నిలదీస్తే..!

Updated Date - 2023-11-12T18:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising