Shocking: పొలాల్లో చెట్ల పొదల్లో మూట.. పదే పదే కదులుతుండటంతో అటుగా వెళ్తున్న రైతుకు డౌట్.. భయపడుతూనే ఓపెన్ చేసి చూస్తే..!
ABN, First Publish Date - 2023-11-10T16:21:50+05:30
ఆ రైతు ఎప్పటిలా ఆ రోజు సాయంత్రం కూడా తన పొలంలోకి వెళ్లాడు.. పొలంలో చెట్ల పొదల్లో అతడికి ఓ మూట కనిపించింది.. ఆ మూట కదులుతుండడంతో అతడికి అనుమానం వచ్చింది.. భయపడుతూనే ఆ మూట ఓపెన్ చేసి చూసి ఆ రైతు షాకయ్యాడు..
ఆ రైతు ఎప్పటిలా ఆ రోజు సాయంత్రం కూడా తన పొలంలోకి వెళ్లాడు.. పొలంలో చెట్ల పొదల్లో అతడికి ఓ మూట కనిపించింది.. ఆ మూట కదులుతుండడంతో అతడికి అనుమానం వచ్చింది.. భయపడుతూనే ఆ మూట ఓపెన్ చేసి చూసి ఆ రైతు షాకయ్యాడు.. ఆ మూటలో ఇద్దరు చిన్న పిల్లలు (Child) ఉన్నారు.. వారి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి.. వారి నోళ్లకు టేపు వేసి ఉంది.. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లఖింపూర్ ఖేరీలో ఈ ఘటన జరిగింది (Crime News).
లఖింపూర్ ఖేరీలోలోని ఉచౌలియా గ్రామానికి చెందిన అవ్‌నీష్ కుమార్ అనే వ్యక్తి పిల్లలు అనికేత్ (4), ఇంద్రపాల్ (3) గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్నారు. రోజూ లాగానే మంగళవారం కూడా వారు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి బయల్దేరారు. ఎంత సేపటికీ ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Viral Video: అక్కడ స్పేస్ లేదు.. వాళ్లే క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియోను చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం..!
పోలీసులు గ్రామంలో విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పిల్లలిద్దరినీ చూసినట్టు కొందరు చెప్పారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. కాగా, అదే రోజు సాయంత్రం గ్రామ శివారులోని ఓ పొలంలో పిల్లలిద్దరూ ఓ గోనె సంచిలో కట్టేసి ఉన్న స్థితిలో ఓ రైతుకు దొరికారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పిల్లలను విచారించగా గ్రామస్థులు చెప్పిన వ్యక్తే తమను అలా కట్టి పడేశాడని చెప్పారు. తర్వాతి రోజు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసమే ఆ వ్యక్తి అలా కిడ్నాప్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Updated Date - 2023-11-10T16:21:52+05:30 IST