ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan kalyan : ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. పవన్‌పై అభిమానం ఈ రేంజ్‌లోనా.. ఓ లుక్ వేస్కోరా సాంబ..!

ABN, First Publish Date - 2023-02-04T21:24:19+05:30

టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే కొందరు ప్రాణమిస్తారు. మరికొందరు ఆయన్ను దేవుడితో (God) సమానంగా చూస్తారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే కొందరు ప్రాణమిస్తారు. మరికొందరు ఆయన్ను దేవుడితో (God) సమానంగా చూస్తారు. ఇంకొందరైతే ఆయనకు ప్రత్యేక స్థానం, గుర్తింపును ఇస్తారు. ఇలా కోటాను కోట్లమంది అభిమానులు పవన్‌పై (Pawan) అభిమానం చాటుకోవడానికి ఛాన్స్ వస్తే చాలు అస్సలు వదులుకోరు. తాజాగా పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని (Fan) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఈ వీరాభిమాని ఏం చేశాడో రండి ఓ లుక్కేద్దాం.

ఇదీ అసలు కథ..

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కందరవల్లి గ్రామానికి చెందిన బోడపాటి మణికంఠకు అదే గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మితో ఫిబ్రవరి-9న వివాహం (Mariiage) జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫోటోతో శుభలేఖలు (Wedding Cards) వేయించాడు మణికంఠ. పార్టీ గుర్తు గాజు గ్లాసును (Glass) కూడా ముద్రించాడు. జనసేనకు ఓటు వేసి గెలిపించాలని వినూత్నంగా ప్రచారం చేశాడు. ప్రత్యేకంగా అభిమాని వేయించిన పెళ్లి కార్డులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ కార్డులు ఇచ్చి బంధువులకు, స్నేహితులకు (Friends) పెళ్లికి రావాలంటూ ఆహ్వానిస్తూనే జనసేనకు (Janasena) ఓటు వేయాలని కోరుతున్నాడు.

వేరే లెవల్..!

పెళ్లి కార్డుపై వారాహి (Varahi) వాహనంపై నిల్చుని గద పట్టుకున్న ఫొటోను ముద్రించాడు ఫ్యాన్. కింది భాగంలో గ్లాస్ గుర్తుకు (Glass Symbol) ఓటేయండని రాయించాడు. పవన్ అభిమాని తన వీరాభిమానాన్ని ఇలా బయటపెట్టడంతో నెట్టింట్లో పెళ్లికార్డు ఫొటోలు (Photos) వైరల్ (Viral) అవుతున్నాయి. ఈ కార్డులు చూసిన నెటిజన్లు అభిమానం అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానంలో ఇది వేరే లెవల్ అని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ రాస్తున్నారు. ‘అబ్బబ్బా.. ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి ఫ్యాన్స్ అంతా లుక్ వేస్కోండ్రా సాంబ’ అని పవన్ డైలాగ్స్‌ కామెంట్స్ రూపంలో రాసుకొస్తున్నారు వీరాభిమానులు. కాగా ఇలా తమ అభిమాన రాజకీయ నేత (Political Leader), అభిమాన హీరో (Hero) ఫొటోలను పెళ్లి కార్డులపై ముద్రించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2023-02-04T21:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising