ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife-Husband: 8 ఏళ్ల క్రితమే పెళ్లి.. ఇద్దరు కూతుళ్లు కూడా.. వీళ్ల హ్యాపీ లైఫ్‌తో విధి ఆడుకుందో ఆట.. ఒకే ఒక్క ఘటనతో..!

ABN, First Publish Date - 2023-11-15T18:48:59+05:30

వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.. ఆర్థికంగా, కుటుంబంగా ఎలాంటి ఇబ్బందీ లేదు.. కేవలం చిన్న సమస్య వారి మధ్య చిచ్చు పెట్టింది.. అన్నయ్యతో పండగ సెలబ్రేట్ చేసుకోవాలని ఆమె అనుకుంది.. అందుకు భర్త ఒప్పుకోలేదు..

వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.. ఆర్థికంగా, కుటుంబంగా ఎలాంటి ఇబ్బందీ లేదు.. కేవలం చిన్న సమస్య వారి మధ్య చిచ్చు పెట్టింది.. అన్నయ్యతో పండగ సెలబ్రేట్ చేసుకోవాలని ఆమె అనుకుంది.. అందుకు భర్త ఒప్పుకోలేదు.. అయినా ఆమె వెళ్తాననడంతో భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.. విషయం తెలిసి భార్య కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ ఘటన జరిగింది (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీకి చెందిన దీపక్ (32) అనే వ్యక్తి వృత్తిరీత్యా వస్త్ర వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాడు. అతడు 8 ఏళ్ల క్రితం శుభంగి (30) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబం. దీపావళి తర్వాత వచ్చే భాయ్ దూజ్ (సోదరుడితో కలిసి సోదరి చేసుకునే పండగ) కోసం పుట్టింటికి వెళ్లాలని శుభంగి అనుకుంది. వెళ్లడానికి వీల్లేదని దీపక్ ఆదేశించాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది (Husband and Wife).

Woman: దారుణం.. బస్ ఎక్కిన మహిళకు ఫిట్స్ .. హాస్పిటల్‌కు తీసుకెళ్తామన్న యువకులు.. ఎంత నీచానికి పాల్పడ్డారంటే.. పోలీసులకు చెప్పినా..!

ఆ వివాదం విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన దీపక్ బెడ్రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయంలో తెలిసిన వెంటనే శుభంగి కూడా ఉరేసుకుంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2023-11-15T18:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising