ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime: వర్షంలో తడవకూడదని సెలూన్ షాపు ముందు నిల్చోవడమే ఆ బాలిక పాలిట శాపమయింది.. స్కూలు నుంచి తిరిగొస్తోంటే..

ABN, First Publish Date - 2023-06-01T18:50:02+05:30

సాధారణంగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంటుంది. వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి చాలా మంది పక్కనే ఉన్న ఏ చెట్టు కిందకో లేక దగ్గరలో ఉన్న షాపు ఆవరణాల్లోకో పరిగెడుతుంటారు. ఓ బాలిక స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంటుంది. వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి చాలా మంది పక్కనే ఉన్న ఏ చెట్టు కిందకో లేక దగ్గరలో ఉన్న షాపు ఆవరణాల్లోకో పరిగెడుతుంటారు. ఓ బాలిక స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి తిరిగి వస్తోంది. అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వర్షంలో తడవకూడదని ఆ పాప దగ్గరలోనే ఉన్న సెలూన్ షాపు దగ్గరకు పరిగెత్తింది. అలా వెళ్ళడమే ఆ పాప పాలిట శాపమైంది. ఆ పాప జీవితంలో మర్చిపోలేని సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హర్యానా(Haryana) రాష్ట్రం ఫరీదాబాద్(Faridabad) లోని ఆదర్మ్ నగర్ లో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తోంది. ఆ పాప పాఠశాల విద్యార్థి(school girl). రోజులానే పాఠశాలకు వెళ్ళింది. స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఆ పాప రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంటే ఉన్నట్టుండి వర్షం(sudden rain) మొదలైంది. వర్షం బాగా కురుస్తుండటంతో ముందుకు వెళ్ళడం మంచిది కాదని అటూ ఇటూ చూసింది. దగ్గరలోనే ఓ సెలూన్ షాపు(salon shop), ఆ షాపు బయట కాస్త ఓపెన్ ప్లేస్ కనిపించింది. వెంటనే ఆ పాప సెలూన్ షాపు దగ్గరకు పరిగెత్తుకెళ్ళి బయట నిలబడుకుంది(school girl standing out of salon shop). షాపు బయట బాలిక నిలబడుకుని ఉండటం షాపు నిర్వాహకుడు 23ఏళ్ళ ప్రవీణ్ అనే వ్యక్తి చూశాడు. అతను ఆ పాపతో 'వర్షం ఎక్కువగా పడుతోంది. బయట ఎందుకు నిలబడతావు లోపలికిరా..' అని పిలిచాడు. పాపం అతను మంచోడేమోనని ఆ పాప లోపలికి వెళ్లింది. వెంటనే ప్రవీణ్ తన దగ్గరున్న కత్తి చూపించి ఆ పాపను బెదిరించి అత్యాచారం చేశాడు(school girl raped).

WiFi: ఏం కాదులే అని వైఫై రూటర్ స్విచ్‌ను 24 గంటలూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? ఈ నిజాలు తెలిస్తే..!


అత్యాచారం అయిన వెంటనే ఆ పాప ఏడుస్తూ భయంగా ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో జరిగింది మొత్తం చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు(girl parents complained to police). దీంతో పోలీసులు సంఘటన జరిగిన 5గంటల్లోపే నిందుతుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ ది గురుగ్రామ్(Gurugram) లోని గెంఘాలా అనే గ్రామం. అతను ఫరీదాబాద్ లో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని మీద ఇదివరకే మైనర్ బాలిక అత్యాచారం కేసు ఉండటం అందరినీ విస్మయపరిచే విషయం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.

Viral Video: ఆ మేకప్ తీసేయమ్మా తల్లీ.. కొడుకు కూడా గుర్తు పట్టడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు.. ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే..


Updated Date - 2023-06-01T18:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising