Viral Video: ఆ మేకప్ తీసేయమ్మా తల్లీ.. కొడుకు కూడా గుర్తు పట్టడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు.. ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే..

ABN , First Publish Date - 2023-06-01T14:02:25+05:30 IST

పిల్లలు తమ తల్లిదండ్రులను వారికి నచ్చినట్టు చూడటానికే ఇష్టపడతారు. తల్లి దండ్రుల వేషం, వారి మాటతీరు ఉన్నట్టుండి మారిపోతే ఆ మార్పును వారు జీర్ణించుకోలేరు. ఓ మహిళ మేకప్ వేసుకున్న తరువాత చాలా దారుణమైన అనుభవం చెవిచూసింది. పాపం..

Viral Video: ఆ మేకప్ తీసేయమ్మా తల్లీ.. కొడుకు కూడా గుర్తు పట్టడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు.. ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే..

యూట్యూబ్ ఓపన్ చేస్తే చైనా అమ్మాయిల మేకప్ షార్ట్ చాలా ఉంటాయి. పండు ముసలిగా ఉన్నవారు కూడా పదహారేళ్ల యువతుల్లా మాయ చేస్తారు అందులో. ఇదంతా మేకప్ లో ఉన్న మహిమ అని చెప్పుకోవచ్చు. ఓ మహిళ మేకప్ వేసుకున్న తరువాత చాలా దారుణమైన అనుభవం చెవిచూసింది. పాపం ఆమె కన్న కొడుకే ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ మీద ఒకటే సెటైర్లు, పంచులు వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంచి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలు తమ తల్లిదండ్రులను వారికి నచ్చినట్టు చూడటానికే ఇష్టపడతారు. తల్లి దండ్రుల వేషం, వారి మాటతీరు ఉన్నట్టుండి మారిపోతే ఆ మార్పును వారు జీర్ణించుకోలేరు. వీడియోలో ఓ మహిళ బ్యూటీ సెలూన్(Beauty salon) కు వెళ్ళింది. అక్కడ ఆమె చాలా గ్రాండ్ గా తయారైంది. దుస్తుల దగ్గర నుండి, మేకప్ వరకు ఆమె సెలబ్రిటీలా రెడీ(women get ready as celebrity) అయ్యింది. ఆమె రెడీ అయిన తరువాత ఆ మహిళ కొడుకు(women son) అక్కడికి వచ్చాడు. అప్పటిదాకా వంటపని, ఇంటి పని చేసుకుంటూ తనను స్కూలుకు రెడీ చేసి పంపించిన తల్లినే ఆ పిల్లాడు చూశాడు. కానీ ఆమె మేకోవర్ చూసి ఆ పిల్లాడు గుర్తుపట్టలేకపోయాడు(son didn't remember her mother). ఆ మహిళ 'నేనే మీ అమ్మను' అని చెబుతున్నా ఆ పిల్లాడు వినలేదు. నువ్వు మా అమ్మవి కాదన్నట్టు మొండిగా ఏడుస్తూ ముందుకెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్లు ఆ పిల్లాడితో 'ఆమె మీ అమ్మే..' అని చెప్పినా ఆ పిల్లాడు వినలేదు. పైపెచ్చు ఓ... అని ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడే ఉన్న సోఫాలో వెళ్లి కూర్చుని ఆ పిల్లాడు ఏడుస్తోంటే ఆ పిల్లాడి తల్లి దగ్గరకెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకుని బుజ్జిగించాలని చూసింది. కానీ ఆ పిల్లాడు అసలు తగ్గలేదు.

Viral Video: టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడో వృద్ధుడు.. ఓ కుర్రాడు తన వైపే రావడం చూసి కంగారు.. ట్యాబ్‌లో అతడు చూపించిన ఫొటోను చూసి..!


ఈ వీడియోను visagesalon1 అనే ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'నువ్వు మొదట మేకప్ తీసేయవమ్మా తల్లీ.. ఆ పిల్లాడు ఏడవడం కూడా ఆపేస్తాడు' అని సెటైర్లు వేస్తున్నారు. 'మిమ్మల్ని మీ పిల్లాడే గుర్తుపట్టలేకపోయినప్పుడు అలాంటి మేకప్ వేసుకుని ఏం లాభం?' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ పిల్లాడు తన తండ్రిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఆమె భర్త ఆమెను గుర్తించకపోతే చాలా కష్టం' అని పంచులు వేస్తున్నారు.

WhatsApp: ఫ్యామిలీ వాట్సప్ గ్రూపులో అలాంటి ఫొటో పెట్టావేంటి..? వెంటనే డిలీట్ చెయ్.. అంటూ అక్క మెసేజ్.. తమ్ముడు చేసిన మిస్టేక్‌తో..


Updated Date - 2023-06-01T14:02:25+05:30 IST