Viral: ఒకే రోజు వేర్వేరు విమానాల్లో ప్రయాణిస్తున్న దంపతులకు షాకింగ్ అనుభవం.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Dec 22 , 2023 | 03:09 PM
ఇటలీకి చెందిన ఓ జంటకు ఒకే రోజు షాపింగ్ అనుభవం ఎదురైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఇద్దరూ ఒకే తరహాలో ప్రమాదాలకు గురయ్యారు. అయితే అనుకోకుండా ప్రాణాలు దక్కించుకుని గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇటలీకి (Italy) చెందిన ఓ జంటకు ఒకే రోజు షాకింగ్ అనుభవం ఎదురైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఇద్దరూ ఒకే తరహాలో ప్రమాదాలకు గురయ్యారు. అయితే అనుకోకుండా ప్రాణాలు దక్కించుకుని గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటలీకి చెందిన స్టెఫానో పిరిల్లి, అతని భార్య ఆంటోనియెట్టా డెమాసి వేర్వేరు జెట్‌లలో టురిన్‌కు బయల్దేరారు. అయితే కొద్ది సేపటికే స్టెఫానో జెట్ ఇంజిన్ ఫెయిల్ అయి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది (Plane Crashes ).
భర్త విమానం పడిపోయిన కొద్ది సేపటికి డెమాసి విమానం కూడా నేల పైకి దూసుకెళ్లిపోయింది. ఆ రెండు ప్రమాద స్థలాలకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని వారిని రక్షించారు. ఈ ఘటనలో డెమాసీకి పెల్విస్ గాయం అయింది. స్టెఫానో మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఉష్ణగ్రతలు అకస్మాత్తుగా పడిపోవడంతో పొగమంచు ప్రారంభమైందని, అందువల్లే జెట్‌లు ప్రమాదాలకు గురయ్యాయని నిపుణులు అంచనా వేశారు. ఏదేమైనా ఆ భార్యభర్తలిద్దరూ అదృష్టవంతులని చాలా మంది పేర్కొంటున్నారు (Husband and Wife).
``ఆ రోజు మా ఉదయం చాలా అందంగా ప్రారంభమైంది. వాతావరణం బాగుండడంతో జెట్‌లతో గాల్లో ఎగరాలనుకున్నాం. గాల్లోకి ఎగిరాక అనుకోని ప్రమాదం ఎదురైంది. ఏదేమైనా ఇద్దరం ప్రాణాలతో బయటపడడం చాలా సంతోషంగా ఉంద``ని స్టెఫానో పేర్కొన్నాడు. డెమాసి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.
Updated Date - Dec 22 , 2023 | 03:09 PM