Viral: వద్దని వేడుకున్నా సరే.. 11 ఏళ్ల వయసుకే ఇతడికి పెళ్లి చేసిన తండ్రి.. ప్రస్తుతం ఈ కుర్రాడు వార్తల్లో వ్యక్తిగా నిలవడం వెనుక..!
ABN, First Publish Date - 2023-06-21T19:00:51+05:30
సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాగైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఓ కుర్రాడు నిరూపించాడు. అనేక సమస్యలు, అడ్డంకులు ఎదురైనా అతడు పట్టు వదలకుండా కృష్టి చేసి తను కోరుకున్నది సాధించాడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.
సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాగైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఓ కుర్రాడు నిరూపించాడు. అనేక సమస్యలు, అడ్డంకులు ఎదురైనా అతడు పట్టు వదలకుండా కృష్టి చేసి తను కోరుకున్నది సాధించాడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం సాధించాడు అనుకుంటున్నారా? నీట్ పరీక్ష (Neet Exam)లో 720కి 632 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు. అందులో అంత పెద్ద గొప్ప ఏముంది అనుకుంటున్నారా? అయితే అతడి కథ మీరు తెలుసుకోవాల్సిందే..
రాజస్థాన్ (Rajasthan) లోని చిత్తోర్‌గఢ్‌కు సమీపంలోని ఘోసుండా ప్రాంతానికి చెందిన రామ్‌లాల్‌కు చిన్నప్పట్నుంచి చదువు అంటే చాలా ఇష్టం. తను డాక్టర్ (Doctor) కావాలని కలలు కనేవాడు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం అతడి చదువును సజావుగా సాగనివ్వలేదు. రామ్‌లాల్‌కు 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహాం (Child Marriage) చేశారు. అప్పుడు రామ్‌లాల్ కేవలం 6వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. పెళ్లి తర్వాత చదువుకునేందుకు రామ్‌లాల్ తండ్రి అంగీకరించలేదు. చదువుకుంటాను అంటే కొడుకును చితక్కొట్టేవాడు. దాంతో రామ్‌లాల్ తన భార్యకు విషయం చెప్పాడు. అప్పటికి ఆమె వయసు కూడా 11 ఏళ్లే. అయినా ఆమె రామ్‌లాల్ ఆశయాన్ని అర్థం చేసుకుని మద్దతుగా నిలిచింది.
రామ్ లాల్ భార్య అతడితో కలిసి పదోతరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత భర్త చదువుకు మద్దతుగా నిలబడింది. రామ్ లాల్10 వ తరగతి లో 74 శాతం ఉత్తీర్ణతతో పాసయ్యాడు. ఆ తర్వాత తనకు ఇష్టమైన సైన్స్ కోర్సును తీసుకుని ఇంటర్ పూర్తి చేశాడు. తొలిసారి 2019లో నీట్ పరీక్షను రాశాడు. అయితే అప్పుడు 720 మార్కులకు 350 మాత్రమే వచ్చాయి. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా కోటా వెళ్లి శిక్షణ తీసుకున్నాడు. తర్వాత 2022లో మళ్లీ నీట్ పరీక్ష రాసి 490 మార్కులు సాధించాడు. అయితే ఆశించిన కాలేజీలో సీటు రాలేదు.
Viral Video: ఫైవ్ స్టార్ హోటల్‌లో లగ్జరీ లైఫ్.. రెండేళ్ల పాటు ఉన్నా అతడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టలేదు..!
చివరగా తన 21వ ఏట ఐదో సారి ప్రయత్నించాడు. గతంలో చేసిన తప్పులను బేరీజు వేసుకుని పూర్తిగా సిద్ధమయ్యాడు. 2023లో నీట్ పరీక్ష రాసి 720కి ఏకంగా 632 మార్కులు తెచ్చుకుని మంచి ర్యాంకు సాధించాడు. దీంతో రామ్‌లాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కుటుంబంలో తానే మొదటి డాక్టర్‌నని చెబుతున్నాడు. తన భార్య ఇచ్చిన సహాకారాన్ని ఎప్పటికీ మరవలేనని భావోద్వేగానికి లోనయ్యాడు.
Updated Date - 2023-06-21T19:00:51+05:30 IST