Viral Video: ఫైవ్ స్టార్ హోటల్‌లో లగ్జరీ లైఫ్.. రెండేళ్ల పాటు ఉన్నా అతడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టలేదు..!
ABN , First Publish Date - 2023-06-21T18:36:34+05:30 IST
ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేయడమంటే సామాన్యులకు అంత సులభం కాదు. అక్కడ బిల్లు చూస్తే నిజంగానే చుక్కలు కనబడతాయి. అలాంటి ఓ యువకుడు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏకంగా 2 సంవత్సరాల పాటు బస చేశాడు. హ్యాపీగా అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను అనుభవించాడు.
ఫైవ్‌స్టార్ హోటల్ (Five star hotel)లో బస చేయడమంటే సామాన్యులకు అంత సులభం కాదు. అక్కడ బిల్లు చూస్తే నిజంగానే చుక్కలు కనబడతాయి. అలాంటిది ఓ యువకుడు ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏకంగా 2 సంవత్సరాల పాటు బస చేశాడు. హ్యాపీగా అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను అనుభవించాడు. ఆ తర్వాత రూపాయి కూడా చెల్లించకుండా చక్కగా బయటపడ్డాడు. దీంతో ఆ హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. అతడు ఆ హోటల్ వారికి చెల్లించాల్సిన బిల్లు దాదాపు 58 లక్షల రూపాయలు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు (Crime News).
అంకుష్ దత్తా అనే యువకుడు మే 30, 2021న ఢిల్లీ (Delhi)లోని ఏరోసిటీలోని రోసేట్ హోటల్ (Roseate Hotel)లో బస చేసేందుకు వచ్చాడు. మొదట ఒక్క రోజు మాత్రమే రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అలా పొడిగించుకుంటూ వెళ్లిపోయాడు. జనవరి 22, 2023న అంకుష్ బిల్లు చెల్లించకుండా హోటల్ నుంచి వెళ్లిపోయాడు. అతను మొత్తం 603 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు హోటల్‌లో ఉన్నాడు. ఇన్ని రోజుల బిల్లు (Hotel bill) రూ.58 లక్షలు అయింది. దీంతో హోటల్ మేనేజర్ వినోద్ మల్హోత్రా అతనిపై ఐజిఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Viral Video: 20 ఏళ్ల వయసుకే రూ.22 వేల ఖరీదైన షర్టును కొన్నానంటూ ట్వీట్ చేసిన కుర్రాడు.. ఆ తర్వాత జరిగిందేంటో చూస్తే..!
అతడికి సహకరించిన హోటల్ సిబ్బంది ఇద్దరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ రిసెప్షనిస్ట్ అయిన ప్రేమ్ అనే యువకుడు ఈ విషయంలో అంకుష్‌కు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హోటల్ సాఫ్ట్‌వేర్ రికార్డుల నుంచి అంకుష్ పేరును, అతడు చెల్లించాల్సిన బిల్లును ప్రేమ్ తొలగించాడు. దీంతో పోలీసులు చీటింగ్ (Cheating case) కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.