Buffalo: రూ.2 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసిన గేదె.. ఆ తర్వాత జరిగిందేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-10-02T19:37:15+05:30
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సారసి అనే గ్రామంలో ఓ గేదె తన యాజమానురాలి మంగళసూత్రాన్ని మింగేసింది. అయితే ఆమె సకాలంలో గుర్తించి వెంటనే స్పందించడంతో నష్టం తప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మహారాష్ట్ర (Maharashtra)లోని వాషిమ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సారసి అనే గ్రామంలో ఓ గేదె (Buffalo) తన యాజమానురాలి మంగళసూత్రాన్ని (Mangalsutra) మింగేసింది. అయితే ఆమె సకాలంలో గుర్తించి వెంటనే స్పందించడంతో నష్టం తప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సారసి గ్రామానికి చెందిన రైతు రాంహరి భార్య తన మంగళసూత్రాన్ని తీసి సోయాబీన్ తొక్కలు ఉన్న ప్లేట్‌లో పెట్టి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన అనంతరం తిరిగి మంగళసూత్రాన్ని తిరిగి ధరించడం మరచిపోయింది (Buffalo swallows mangalsutra).
ఇంటి పనుల్లో పడి మంగళసూత్రాన్ని మర్చిపోయింది. దాదాపు గంటన్నర తర్వాత తన మెడలో మంగళసూత్రం లేదని గుర్తించింది. ఆ మంగళసూత్రం కోసం చాలా సేపు వెతికింది. ఆ మంగళసూత్రాన్ని సోయాబీన్ తొక్కలు ఉన్న ప్లేట్‌లో పెట్టినట్టు గుర్తుకొచ్చి వెంటనే పశువుల కొట్టానికి పరిగెత్తింది. ప్లేట్ మొత్తం ఖాళీగా ఉండడంతో గేదె తన మంగళసూత్రాన్ని మింగేసినట్టు గ్రహించింది. వెంటనే రామ్‌హరి ఆ విషయాన్ని పశువుల వైద్యుడికి ఫోన్ చేసి చెప్పాడు.
Viral Video: మొక్కజొన్నను వెరైటీగా తినాలనుకుంది.. జుట్టు ఊడిపోయింది.. అసలేం జరిగిందో చూడండి..
వైద్యుడి సూచన మేరకు గేదెను వెంటనే పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ గేదె కడుపులో మంగళసూత్రం ఉన్నట్టు మెటల్ డిటెక్టర్ సహాయంతో డాక్టర్ బాలా సాహెబ్ గుర్తించాడు. వెంటనే ఆ గేదెకు ఆపరేషన్ చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత ఆ గేదెకు 65 కుట్లు వేశారు. దాదాపు రెండు తులాలు ఉన్న ఆ మంగళసూత్రం ఖరీదు రూ.2 లక్షల వరకు ఉంటుంది.
Updated Date - 2023-10-02T19:40:00+05:30 IST