Viral Video: మొక్కజొన్నను వెరైటీగా తినాలనుకుంది.. జుట్టు ఊడిపోయింది.. అసలేం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-10-02T19:25:06+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఛాలెంజ్‌లు మొదలయ్యాయి. ఆ ఛాలెంజ్‌లను స్వీకరించి వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఆ క్రమంలో ఒక్కోసారి తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.

Viral Video: మొక్కజొన్నను వెరైటీగా తినాలనుకుంది.. జుట్టు ఊడిపోయింది.. అసలేం జరిగిందో చూడండి..

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక రకరకాల ఛాలెంజ్‌లు మొదలయ్యాయి. ఆ ఛాలెంజ్‌లను స్వీకరించి వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఆ క్రమంలో ఒక్కోసారి తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి అలాంటి ప్రయత్నమే చేసి భారీ మూల్యం చెల్లించింది. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

@ZeroIQPeople అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో యువతి రొటేటింగ్ కార్న్ ఛాలెంజ్‌ను (Rotating Corn Challenge) స్వీకరించింది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కజొన్నను డ్రిల్‌ మెషిన్‌కు (Drill Machine) గుచ్చి దానిని ఆన్‌ చేస్తారు. అది తిరుగుతుంటే నోటితో మొక్కజొన్న తినడం ఈ ఛాలెంజ్‌. ఈ ఛాలెంజ్ ప్రయత్నించి చాలా మంది పళ్లు రాలగొట్టుకున్నారు. చైనా (China)కు చెందిన ఓ యువతి ఈ ఛాలెంజ్‌లో పాల్గొని జుట్టు ఊడగొట్టుకుంది. సదరు యువతి డ్రిల్ మెషిన్‌లో మొక్కజొన్న (Corn) అమర్చి స్విచ్‌ ఆన్‌ చేసింది. మెషిన్ తిరుగుతుండగా మొక్కజొన్నను తినడానికి ప్రయత్నించింది.

Marriage: పెళ్లి చేసుకునేది అందుకా?.. ఓ విద్యార్థి రాసిన జవాబుకు అవాక్కైన సోషల్ టీచర్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!

ఇంతలో ఆమె తల వెంట్రుకలు కొన్ని పాటు డ్రిల్ మిషన్‌లో ఇరుక్కు పోయాయి. దాంతో ఆ డ్రిల్ మెషిన్ ఆమె ముందరి భాగంలో ఉన్న జుట్టును లాగేసింది. జుట్టు ఊడిన భాగంలో రక్తస్రావం కూడా అయింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 17 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ``పవర్ టూల్స్‌తో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు``, ``తగిన శాస్తి జరిగింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-02T19:37:33+05:30 IST