Marriage: పెళ్లి చేసుకునేది అందుకా?.. ఓ విద్యార్థి రాసిన జవాబుకు అవాక్కైన సోషల్ టీచర్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!

ABN , First Publish Date - 2023-10-02T16:49:07+05:30 IST

పెళ్లి అంటే ఏమిటి? అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెబుతారు. వివాహ బంధంలో ఉన్నవారు ఒకలా, పెళ్లి చేసుకోవాలనుకునేవారు మరొకలా ఈ ప్రశ్నకు జవాబిస్తారు. అయితే ఈ ప్రశ్నకు ఓ స్టూడెంట్ ఇచ్చిన సమాధానం మాత్రం వెరైటీగా ఉంది.

Marriage: పెళ్లి చేసుకునేది అందుకా?.. ఓ విద్యార్థి రాసిన జవాబుకు అవాక్కైన సోషల్ టీచర్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!

పెళ్లి (Marriage) అంటే ఏమిటి? అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెబుతారు. వివాహ బంధంలో ఉన్నవారు ఒకలా, పెళ్లి చేసుకోవాలనుకునేవారు మరొకలా ఈ ప్రశ్నకు జవాబిస్తారు. అయితే ఈ ప్రశ్నకు ఓ స్టూడెంట్ (Student) ఇచ్చిన సమాధానం మాత్రం వెరైటీగా ఉంది. సాంఘిక శాస్త్రం పరీక్షలో ఒక విద్యార్థి.. పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఆ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Definition to marriage).

@srpdaa అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ ఆన్సర్ షీట్ (Answer Sheet) షేర్ అయింది. ``పెళ్లి అంటే ఏమిటి?`` అనే ప్రశ్నకు కింద విద్యార్థి తన జవాబు రాశాడు. ````నువ్వు పెద్దదానికి అయ్యావు. మేం ఇక నీకు తిండి పెట్టలేం. నిన్న పోషించే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో`` అని అమ్మాయికి తల్లిదండ్రులు చెబుతారు. అప్పుడు ఆ అమ్మాయి ఓ అబ్బాయిని కలుస్తుంది. ఇంట్లో వాళ్లు ఆ అబ్బాయిపై ``పెళ్లి చేసుకో`` అని అరుస్తుంటారు. అప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి అన్ని పరీక్షలు చేసుకుని కలిసి బతుకడం ప్రారంభిస్తారు. కొన్ని చెత్త పనులు చేసి పిల్లలను కంటారు`` అని జవాబిచ్చాడు.

Viral Video: ప్రియురాలు కరిచింది.. ఆమె గుర్తుగా ఆ కుర్రాడు ఏం చేశాడంటే.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ఆ విద్యార్థి రాసిన జవాబు చూసి టీచర్ బిత్తరపోయాడు. ఆ విద్యార్థికి పదికి సున్నా మార్కులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఆన్సర్ షీట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ``ఆ కుర్రాడు కరెక్ట్‌గా రాశాడు.. పదికి పది మార్కులు ఇవ్వాలి``, ``చిన్న వయసులోనే పెళ్లి అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు``, ``ఆ కుర్రాడు వెరీ స్మార్ట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-02T16:49:07+05:30 IST