Viral Video: ప్రియురాలు కరిచింది.. ఆమె గుర్తుగా ఆ కుర్రాడు ఏం చేశాడంటే.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN , First Publish Date - 2023-10-02T16:26:13+05:30 IST

ప్రేమకు హద్దులు లేవు. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తము ప్రేమించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తమ ప్రియమైన వారి పేరును టూటూలుగా వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు.

Viral Video: ప్రియురాలు కరిచింది.. ఆమె గుర్తుగా ఆ కుర్రాడు ఏం చేశాడంటే.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ప్రేమకు (Love) హద్దులు లేవు. కొందరు తమ ప్రియమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తము ప్రేమించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తమ ప్రియమైన వారి (Lover) పేరును టూటూలుగా (Tattoo) వేయించుకోవడాన్ని కొందరు ఇష్టపడతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో కుర్రాడు కూడా అలాగే చేశాడు. అయితే ఆ కుర్రాడు తన ప్రేయసి పేరును టాటూగా వేయించుకోలేదు.. ఆమె పంటి గాట్లను టాటూగా (Bite tattoo) వేయించుకున్నాడు.

skytattoos111 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువ జంట టాటూ స్టూడియోకు వెళ్లింది. అక్కడ ప్రియుడి చేతి మీద ప్రియురాలు తన పంటి గాట్లు పడేలా గట్టిగా కరిచింది (Bite). ఆ కుర్రాడి చేతి మీద ఆమె పంటి గాట్లు పడ్డాయి. ఆ గాట్లు మీద ఆరిస్ట్ టాటూ వేశాడు. కింద ఆ టాటూ వేయించుకున్న డేట్ కూడా ముద్రించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

Viral Video: హీరోయిన్‌తో లైవ్ కాల్ మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో అమ్మ వచ్చి ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 5.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ```ఇదెక్కడి ప్రేమ..``, ``ఇంత మురికి టాటూను ఎప్పుడూ చూడలేదు``, ``నేను ఇలా ఎప్పటికీ చేయను``, ``బాబోయ్.. ఈ ఐడియా చాలా చెత్తగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-10-02T16:26:13+05:30 IST