ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bride: వధువు స్నేహితుల కామెంట్స్ విని ఏడుస్తూ వెళ్లిపోయిన వరుడు.. ఈ పెళ్లి నాకొద్దంటూ తేల్చిచెప్పిన యువతి.. అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-06-14T17:48:59+05:30

ఆ యువకుడికి పెళ్లి కుదిరింది.. పెళ్లికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. పెళ్లి రోజు వరుడు కల్యాణమండపానికి చేరుకున్నాడు.. దాదాపు సగం కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి.. వరమాల కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇక, పెళ్లి పీటల మీద కూర్చోవడమే మిగిలింది.. ఆ సమయంలో వధువు స్నేహితులు వరుడి దగ్గరకు వెళ్లారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడికి పెళ్లి (Marriage) కుదిరింది.. పెళ్లికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. పెళ్లి రోజు వరుడు (Groom) కల్యాణమండపానికి చేరుకున్నాడు.. దాదాపు సగం కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి.. వరమాల కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇక, పెళ్లి పీటల మీద కూర్చోవడమే మిగిలింది.. ఆ సమయంలో వధువు (Bride)స్నేహితులు వరుడి దగ్గరకు వెళ్లారు.. అతడితో తమాషాగా మాట్లాడారు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో వరుడు ఏడుస్తూ కల్యాణ మండపం నుంచి బయటకు వెళ్లిపోయాడు.. కొద్ది సేపటి తర్వాత వధువు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మిర్జాపూర్‌కు చెందిన అమ్మాయికి కోపాలోని పాటిలా గ్రామానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. జూన్ 11న, వివాహ ఊరేగింపుతో వరుడు మీర్జాపూర్‌లోని అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వరుడు, వధువు దండలు మార్చుకున్నారు. ఆ సమయంలో వధువుకి వరుడిపై అనుమానం మొదలైంది. వరుడి చేష్టలు చూసి అతడు మానసిక సమస్య (Mentally Retarded)తో బాధపడుతున్నాడని భావించింది. తన అనుమాన్ని నిర్ధారణ చేసుకునేందుకు తన స్నేహితులను ఉపయోగించుకుంది.

Police: తలనొప్పిగా ఉందని టీ తాగేందుకు వెళ్లడమే ఆ పోలీసులు చేసిన పొరపాటయింది.. తిరిగొచ్చి చూసేసరికి..!

పెళ్లి పీటల మీద కూర్చునే ముందు వరుడి గదిలోకి తన స్నేహితులను పంపించింది. వరుడితో సరదాగా మాట్లాడి అతడి మానసిక స్థితి తెలుసుకోవాలని సూచించింది. వధువు స్నేహితుల మాటలకు, కామెంట్లకు వరుడు తట్టుకోలేకపోయాడు. అందరి ముందే ఏడుస్తూ కల్యాణ మండపం నుంచి బయటకు వెళ్లిపోయాడు. వరుడు మానసిక వ్యాధిగ్రస్తుడు అని తెలుసుకున్న వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని రాజీ కుదుర్చుకున్నాయి. లాంఛనాల కింద ఇచ్చిన డబ్బును వరుడి తరఫు వారు వెనక్కి ఇచ్చేశారు.

Updated Date - 2023-06-14T17:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising