Police: తలనొప్పిగా ఉందని టీ తాగేందుకు వెళ్లడమే ఆ పోలీసులు చేసిన పొరపాటయింది.. తిరిగొచ్చి చూసేసరికి..!
ABN , First Publish Date - 2023-06-14T17:11:59+05:30 IST
ఓ పోలీసాయన నిర్లక్ష్యం ఓ నేరస్థుడి పాలిట వరంగా మారింది. హత్య కేసులో నిందితుడైన వ్యక్తి మంగళవారం ఉదయం ఖైదీల వార్డు నుండి పరారీ అయ్యాడు. నిందితుడి తప్పించుకుంటున్న సమయంలో పోలీస్ కానిస్టేబుళ్లు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది.
పోలీసుల నిర్లక్ష్యం ఓ నేరస్థుడి పాలిట వరంగా మారింది. హత్య కేసులో నిందితుడైన వ్యక్తి మంగళవారం ఉదయం ఖైదీల వార్డు నుండి పరారీ అయ్యాడు. నిందితుడు (Accused absconded) తప్పించుకుంటున్న సమయంలో పోలీస్ కానిస్టేబుళ్లు (Police Constables) ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలోని బీకే సివిల్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. హర్యానా (Haryana)లోని తిగావ్‌కి చెందిన నవీన్ అనే యువకుడిపై 2021 మే 22న పోలీసులు హత్య కేసు నమోదు చేశారు (Crime News).
మద్యం సేవించడం కోసం రూ.2000 అడిగితే ఇవ్వలేదనే కోపంతో తన యజమానిని నవీన్ తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టులో విచారణలో ఉంది. నవీన్ అప్పట్నంచి జైలులో ఉంటున్నాడు. ఈ నెల ఆరో తేదీన కడుపునొప్పి అని చెప్పడంతో నవీన్‌ను జైలు నుంచి తీసుకొచ్చి సివిల్ ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో చేర్చారు. అతడికి కాపలాగా నలుగురు కానిస్టేబుళ్లను ఉంచారు.
Crime: తెల్లవారు ఝామన 4 గంటలకు ఇంట్లోంచి కేకలు.. డాబాపై పడుకున్న 13 ఏళ్ల కొడుకు కిందకు వచ్చి.. తలుపు సందుల్లోంచి తొంగి చూస్తే..!
మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ముగ్గురు కానిస్టేబుళ్లు టీ తాగడానికి అని బయల్దేరారు. నవీన్ దగ్గర ఓ కానిస్టేబుల్‌ను కాపాలాగా ఉంచారు. ఆ కానిస్టేబుల్ కొద్ది సేపటి తర్వాత మొబైల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమైపోయాడు. అదే అదనుగా భావించిన నవీన్ వార్డు నుంచి హ్యాపీగా లిఫ్ట్‌లోకి వెళ్లి పరారైపోయాడు. వార్డు నుంచి అతడు తప్పించుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.