ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: కాసేపట్లో పెళ్లనగా ఇంట్లోంచి ఎస్కేప్.. అదే ఊళ్లోని స్కూల్లో దాక్కున్న వధువు.. అసలు కారణం తెలిసి అవాక్కైన బంధువులు..!

ABN, First Publish Date - 2023-06-05T19:22:30+05:30

ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది.. ముహూరం రోజు వరుడి తరఫు వారందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.. అయితే కాసేపట్లో పెళ్లనగా ఆ యువతి అదృశ్యమైపోయింది.. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ అమ్మాయికి పెళ్లి (Marriage) కుదిరింది.. ముహూరం రోజు వరుడి తరఫు వారందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.. అయితే కాసేపట్లో పెళ్లనగా ఆ యువతి అదృశ్యమైపోయింది (Bride run away from wedding hall).. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.. దీంతో నిశ్చయించిన ముహూర్తానికి ఆ వరుడికి మరో అమ్మాయితో పెళ్లి చేసేశారు.. తర్వాత రోజు ఉదయం ఆ పారిపోయిన యువతి తిరిగి వచ్చింది.. తాను ఎందుకు పారిపోయానో చెప్పి అందరికీ షాకిచ్చింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని జాన్‌పూర్ జిల్లా మీర్జాపూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి శనివారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. వరుడు తన బంధుమిత్రులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపట్లో పెళ్లనగా వధువు కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ముందుగా అనుకున్న ముహూర్తానికే ఆ వరుడికి వధువు బంధువులమ్మాయితో పెళ్లయిపోయింది. తర్వాతి రోజు ఉదయం ఆ పారిపోయిన యువతి తిరిగి ఇంటికి చేరుకుంది.

Indian Railway: రైలు పట్టాలను లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు కానీ.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..?

తిరిగి వచ్చిన ఆమెను చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఎక్కడికి వెళ్లిపోయావని ప్రశ్నలు గుప్పించారు. తాను ఊళ్లో ఉన్న స్కూళ్లోనే దాక్కున్నానని ఆమె చెప్పింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, ఐయేఎస్ అధికారి కావాలనేది తన లక్ష్యమని, తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చెప్పింది. పెళ్లి నుంచి తప్పించుకునేందుకే ఇంటి నుంచి పారిపోయినట్టు తెలిపింది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

Updated Date - 2023-06-05T19:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising