Indian Railway: రైలు పట్టాలను లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు కానీ.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..?

ABN , First Publish Date - 2023-06-05T19:07:13+05:30 IST

తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది రైలు మాత్రమే. భారతీయ రైలు సామాన్యుడి వాహనంగా పేరు పొందింది. రైలు ప్రయాణాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే రైల్వే వ్యవస్థ, రైళ్లు నడిచే విధానం గురించి మాత్రం ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు.

Indian Railway: రైలు పట్టాలను లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు కానీ.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..?

తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది రైలు (Train) మాత్రమే. భారతీయ రైలు సామాన్యుడి వాహనంగా పేరు పొందింది. రైలు ప్రయాణాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే రైల్వే వ్యవస్థ (Indian Railways), రైళ్లు నడిచే విధానం గురించి మాత్రం ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ముఖ్యంగా మనం తరుచుగా చూసే రైలు పట్టాల (Railway Tracks) గురించి కూడా మనకు చాలా విషయాలు తెలియవు.

రైలు పట్టాల కింద, మధ్యలోనూ కంకర రాళ్లను (Crushed Stones) అందరూ గమనించే ఉంటారు. కానీ, రైలు పట్టాల మధ్యలో వాటినే ఎందుకు వేస్తారో చాలా మందికి తెలియదు. ఈ కంకర రాళ్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైలు పట్టాల కింద ప్రత్యేక కాంక్రిట్‌తో త‌యారు చేసిన దిమ్మెల‌ను వేస్తారు. త‌ర్వాత ప‌ట్టాల మ‌ధ్యలో, చుట్టుప‌క్కల‌ కంక‌ర రాళ్లు వేస్తారు. ఈ కంక‌ర రాళ్ల వ‌ల్ల ప‌ట్టాల కింద ఉండే దిమ్మెలు క‌ద‌ల‌కుండా ఉంటాయి. అలాగే ప‌ట్టాల‌పై రైలు ప్రయాణించిన‌ప్పుడు కంక‌ర రాళ్ల వ‌ల్ల ప‌ట్టాలు పైకి, కిందకు ఊగినా ఎటూ కదలకుండా ఉంటాయి.

Viral Video: బస్సులో షాకింగ్ సీన్.. వెనుక సీట్లో కూర్చుని వెకిలి చేష్టలు.. భరించలేక ఈ యువతి ఏం చేసిందో మీరే చూడండి..!

ఇక, వ‌ర్షం ప‌డిన‌ప్పుడు కంక‌ర రాళ్లు ఉండ‌టం వ‌ల్ల నీరు సుల‌భంగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా పట్టాల మధ్యలో నీరు నిల్వ ఉండే అవకాశమే ఉండదు. అలాగే రైలు ప‌ట్టాల మ‌ధ్య కంక‌ర ఉండటం వ‌ల్ల పిచ్చి మొక్కలు, పొదలు లాంటివి పెరిగే ప్రమాదం ఉండదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ప‌ట్టాల మ‌ధ్యలోనూ, చుట్టుప‌క్కలా కంక‌ర రాళ్లు వేస్తారు.

Updated Date - 2023-06-05T19:07:13+05:30 IST