Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నిన్ననే వీళ్లిద్దరి పెళ్లి జరిగేది.. వధువు వస్తుందేమోనని సాయంత్రం దాకా ఎదురు చూసి..!
ABN, First Publish Date - 2023-06-13T18:32:52+05:30
పాపం.. ఆ వ్యక్తి పెళ్లి గురించి చాలా ప్రయత్నాలు చేశాడు.. వయసు దాటిపోతున్నా పెళ్లి కాకపోవడంతో బెంగపెట్టుకున్నాడు.. చివరకు ఓ బ్రోకర్ సహాయంతో పెళ్లి కుదుర్చుకున్నాడు.. పెళ్లి ఖర్చు తానే పెట్టుకుంటానని మాటిచ్చాడు.. పెళ్లి కోసం వధువును షాపింగ్‌కు తీసుకెళ్లాడు..
పాపం.. ఆ వ్యక్తి పెళ్లి (Marriage) గురించి చాలా ప్రయత్నాలు చేశాడు.. వయసు దాటిపోతున్నా పెళ్లి కాకపోవడంతో బెంగపెట్టుకున్నాడు.. చివరకు ఓ బ్రోకర్ సహాయంతో పెళ్లి కుదుర్చుకున్నాడు.. పెళ్లి ఖర్చు తానే పెట్టుకుంటానని మాటిచ్చాడు.. పెళ్లి కోసం వధువు (Bride)ను షాపింగ్‌కు తీసుకెళ్లాడు.. ఆమె బట్టలకు, నగలకు రూ. లక్ష ఖర్చుపెట్టాడు.. పెళ్లి రోజు తన బంధువులతో కలిసి రిజస్టర్ ఆఫీస్‌కు చేరుకున్నాడు.. అయితే ఎంతసేపు వేచి చూసిన వధువు మాత్రం అక్కడకు రాలేదు.. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు (Crime News).
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖార్గోన్‌కు చెందిన సునీల్‌కు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. చివరకు ఓ మధ్యవర్తి ద్వారా పేద కుటుంబానికి చెందిన మమత అనే మహిళతో పెళ్లి కుదిరింది. పెళ్లికి అయ్యే ఖర్చులన్నీ తానే పెట్టుకుంటానని వధువు సోదరుడికి సునీల్ మాటిచ్చాడు. జూన్ 12న వీరి వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. రిజస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. జూన్ 9వ తేదీన మమతో కలిసి సునీల్ షాపింగ్‌కు వెళ్లాడు. వధువుకు బట్టలు, నగలు కొన్నాడు. వాటికి రూ. లక్ష రూపాయలు ఖర్చైంది.
Free Bus Journy: ఎవరీ మహిళ..? ఆమెపై కన్నడ నెటిజన్ల ఆగ్రహం వెనుక కథేంటి..? బస్సు టికెట్‌తో సహా ఫొటోను నెట్టింట పోస్ట్ చేయగానే..!
బట్టలు, నగలు తనతో పాటు తీసుకెళ్లిన మమత పెళ్లి రోజు రిజస్టర్ ఆఫీస్‌కు రాలేదు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో తాను మోసపోయినట్టు సునీల్ గ్రహించాడు. మమత, ఆమె సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి వధువుకు నగలు, బట్టలు కొన్నానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-06-13T18:32:52+05:30 IST