Free Bus Journy: ఎవరీ మహిళ..? ఆమెపై కన్నడ నెటిజన్ల ఆగ్రహం వెనుక కథేంటి..? బస్సు టికెట్‌తో సహా ఫొటోను నెట్టింట పోస్ట్ చేయగానే..!
ABN , First Publish Date - 2023-06-13T18:12:41+05:30 IST
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ఇచ్చిన హామీని సిద్దరామయ్య ప్రభుత్వం నిలబెట్టుకుంది.
కర్ణాటక (Karnataka)లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ఇచ్చిన హామీని సిద్దరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం నిలబెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ``శక్తి`` (Shakti) పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ(Free bus ride for women) సదుపాయాన్ని కల్పించింది. చాలా మంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిథి లావణ్య బల్లాల్ జైన్ (Lavanya Ballal Jain) కూడా ఇటీవల కర్ణాటక ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫొటోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ``కర్ణాటకలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్ సర్వీస్‌లో ఇదిగో నా జీరో ఫేర్ టికెట్`` అంటూ కామెంట్ చేసింది. లావణ్య ట్వీట్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. ఆమెపై ట్రోలింగ్ (Trolling)కు దిగారు. ఆ పథకం ఉద్దేశం ఏంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
Bride: పెళ్లయిన మర్నాడే భర్తకు రాఖీ కట్టి షాకిచ్చిన యువతి.. వద్దంటున్నా బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారని..!
``ఆమె నగలు, లిప్‌స్టిక్ కొనుగోలు చేయగలదు. కానీ, బస్సు టిక్కెట్ మాత్రం కొనలేదు. సిగ్గుచేటు``, ``ఇది పేద మహిళల కోసం ఉద్దేశించినది, బోలెడు కార్లు ఉన్న వారి కోసం కాదు``, ``మీ ఒక రోజు మేకప్ ఖర్చు ఈ బస్సు నెలవారీ ఛార్జీల కంటే ఎక్కువ. అయినప్పటికీ, మీరు ఉచితంగా ప్రయాణించి, రాష్ట్ర ఖజానాపై భారాన్ని పెంచారు``, ``ఈ ఉచితాలను ఎంతమంది స్త్రీవాదులు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది కూడా ఆత్మగౌరవానికి సంబంధించినదే. మహిళలకు ఉచితాలను వ్యతిరేకించని మహిళలు తమకు పురుషుల మద్దతు అవసరమని, తాము పురుషుల కంటే తక్కువ అని అంగీకరించినట్టే`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.