Bride: పెళ్లయిన మర్నాడే భర్తకు రాఖీ కట్టి షాకిచ్చిన యువతి.. వద్దంటున్నా బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారని..!

ABN , First Publish Date - 2023-06-13T17:01:04+05:30 IST

ఆ యువతి చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించింది.. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. అయితే ఆ ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లిదండ్రులు ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.. దీంతో ఆ యువతి పెళ్లి జరిగిన మర్నాడే తన భర్తకు రాఖీ కట్టి షాకిచ్చింది..

Bride: పెళ్లయిన మర్నాడే భర్తకు రాఖీ కట్టి షాకిచ్చిన యువతి.. వద్దంటున్నా బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారని..!

ఆ యువతి చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించింది.. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి అతడిని పెళ్లి (Love Marriage) చేసుకోవాలనుకుంది.. అయితే ఆ ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లిదండ్రులు ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.. దీంతో ఆ యువతి పెళ్లి జరిగిన మర్నాడే తన భర్తకు రాఖీ కట్టి షాకిచ్చింది.. అప్పట్నుంచి ఆమెను తల్లిదండ్రులు, భర్త హింసించడం మొదలుపెట్టారు.. బయటకు రాకుండా ఆమెను బందీగా ఉంచారు.. చివరకు పోలీసుల సహాయంతో ఆమె బయటపడింది.

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కంకేర్ జిల్లాకు చెందిన తరుణ శర్మ అనే యువతిపై కన్న తల్లిదండ్రులే దాడికి దిగారు. ఆమెను బంధించి హింసకు పాల్పడ్డారు. తనకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేశారు. 22 ఏళ్ల కూతురికి 40 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు. దీంతో పెళ్లి జరిగిన తర్వాత రోజే భర్తకు తరుణ రాఖీ కట్టి షాకిచ్చింది (Girl tied rakhi to her husband). దీంతో భర్త ఆమెను బంధించాడు. బయటకు రాకుండా కట్టడి చేశాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. చివరకు ఆ యువతి సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని బయటి వారికి తెలియజేసింది.

Shcocking: స్టేషన్‌కు వచ్చి ఏడుస్తున్న 39 ఏళ్ల మహిళ.. పక్కనే ఓ సూట్‌కేస్.. ఏమైందో అర్థం కాక దాన్ని ఓపెన్ చేసి చూసిన పోలీసులకు..!

తన సమస్య గురించి వివరిస్తూ ప్రధాని మోదీ (PM Modi)ని, నటుడు సోనూసూద్‌(Sonu Sood)ను ట్యాగ్ చేస్తూ తన పరిస్థితి వివరిస్తూ ట్వీట్లు చేసింది. ఆ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. ఆ యువతిని విడిపించి సఖి కేంద్రానికి తరలించారు. ఆమె తన చిన్ననాటి స్నేహితుడి ఇంటికి వెళ్లిపోవాలని కోరుకుంటోంది. అందుకు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-13T17:01:04+05:30 IST