Heartbreaking Video: ఆ పక్షి చనిపోయిందని తెలియక.. ఎందుకు లేవడం లేదో దానికి అర్థం కాక.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!
ABN, First Publish Date - 2023-06-23T20:28:20+05:30
బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలు అనేవి మనుషుల్లోనే కాదు.. ఇతర జంతువుల్లో కూడా ఉంటాయి. ప్రియమైన వారు, ఆత్మీయులు దూరం అయినపుడు జంతువులు కూడా విషాదానికి లోనవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
బంధాలు (Relations), అనుబంధాలు, భావోద్వేగాలు అనేవి మనుషుల్లోనే కాదు.. ఇతర జంతువుల్లో కూడా ఉంటాయి. ప్రియమైన వారు, ఆత్మీయులు దూరం అయినపుడు జంతువులు కూడా విషాదానికి లోనవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Bird Videos) చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వీడియో చూసి చాలా మంది నెటజన్లు ఎమోషనల్ అవుతున్నారు. IFS అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Emotional Videos).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పక్షి (Bird) చనిపోయింది. అది చనిపోయిందని తెలియక, దానిని లేపేందుకు మరో పక్షి ప్రయత్నించింది. కదలకుండా పడిపోయిన సహచర పక్షి మళ్లీ లేస్తుందని ఆ పక్షి ఎంతగానో ఎదురుచూసింది. కానీ, నిరాశే ఎదురైంది. తీవ్ర విషాదంలో మునిగిపోయిన రెండో పక్షి కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ ఎమోషనల్ వీడియో చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 79 వేల మందికి పైగా వీక్షించారు.
Viral Video: అయ్యయ్యో ఇలా జరిగిందేంటి..? బాలుడి తలకు ఇరుక్కుపోయిన హెల్మెట్.. ఎంత ప్రయత్నించినా తీయలేక..!
ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``జంతువుల ప్రేమ చాలా స్వచ్ఛమైనది``, ``వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయి``, ``ప్రియమైన వారిని వదులుకోవడం చాలా కష్టం`` అని కొందరు కామెంట్లు చేశారు. అయితే ఒక వ్యక్తి ఇది నిజమైన వీడియో కాదేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ వీడియో కోసం ఆ వ్యక్తే రెండు పక్షులను చంపేసి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేశాడు.
Updated Date - 2023-06-23T20:28:20+05:30 IST