ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bike Video: ఏం టాలెంట్‌ సామీ.. బైక్‌ను ఇలా మార్చేశారేంటి..? ఆరడుగుల పొడవున్నా సరే.. ఈ బైక్‌ను ఎక్కడం అంత ఈజీ కాదేమో..!

ABN, First Publish Date - 2023-06-23T17:24:59+05:30

'ట్యాలెంట్ ఎవడి సొత్తుకాదు' అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి కుర్రాళ్ళను చూసినప్పుడు ఆ మాట నిజమేననిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద పెద్ద ఇంజనీర్లే కాదు. గల్లీ కుర్రాళ్లు కూడా అద్భుతాలు చేసి బేష్ అనిపించుకుంటున్నారు. తమదగ్గరున్న వస్తువులతోనే అద్భుతాలు ఆవిష్కరించడం ఈ కుర్రాళ్ళలో ఉన్న ప్రత్యేకత. ఈ కుర్రాళ్ళు అలాంటి అద్భుతమే చేశారు. స్ప్లెండర్ బైక్ ను ఈ కుర్రాళ్ళు ఎలా మార్చేశారో చూసినవాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

'ట్యాలెంట్ ఎవడి సొత్తుకాదు' అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి కుర్రాళ్ళను చూసినప్పుడు ఆ మాట నిజమేననిపిస్తుంది. ఏ ప్రాంతమో తెలియదు కానీ కొందరు కుర్రాళ్లు స్ప్లెండర్ బైక్ ను వింతగా మార్చేశారు. ఎవరైనా డబుల్ డెక్కర్ బస్ విని ఉంటారు కానీ డబుల్ డెక్కర్ బైక్(double deccker bike) విని ఉండరు. కానీ ఈ కుర్రాళ్లు డబుల్ డెక్కర్ బైక్ ను ఆవిష్కరించారు. వీడియోలో ఓ కుర్రాడు స్ప్లెండర్ బైక్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు.ఇది సాధారణ బైక్ కాదు, డబుల్ డెక్కర్ బైక్. ఈ బైక్ కు కింద రెండు టైర్లు ఉన్నాయి. ఆ తరువాత ఆ రెండింటి మీద మళ్ళీ రెండు టైర్లు ఉన్నాయి. ఇలా మొత్తం నాలుగు టైర్లను రెండు వరుసల్లో సెట్ చేయడం ద్వారా డబుల్ డెక్కర్ బైక్ డిజైన్ చేశారు. ఈ బైక్ ను ఓ కుర్రాడు డ్రైవ్ చేస్తూ చేస్తుంటే వెనక బైక్ పట్టుకుని ఇంకొక కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. ఇది సాధారణ బైక్ లాగే ముందుకు దూసుకుపోయింది. అయితే ఈ బైక్ ఎక్కడం, దిగడం, దానికి స్టాండ్ వేయడం వంటివి వీళ్ళు ఎలా చేస్తారో వీడియోలో చూపించలేదు.

Viral: భార్య పనితీరు ఎలా ఉంది..? అంటూ జీవిత భాగస్వామి గూర్చి రివ్యూ ఇచ్చాడు.. మరుక్షణమే అతడు కలలో కూడా ఊహించని సీన్..!


ఈ వీడియోను splendor.modifications అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కుర్రాళ్ళ క్రియేటీవిటికి అధిరిపడ్డారు. 'ఆరడుగుల పొడవున్న మనిషి అయినా ఈ బైక్ ఎక్కాలంటే అంత ఈజీ కాదేమో' అని అంటున్నారు. 'మనుషుల్లో ఖలీ లాగా బైకులలో ఇది కూడా' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను డ్రైవ్ చేస్తున్నాడు సరే.. ఇంతకూ బైక్ నుండి కిందకు ఎలా దిగుతాడో ఏంటో' అని ఇంకొకరు సందేహం వ్యక్తం చేశారు.

Bike Helmet: హెల్మెట్లను బయటే ఉంచుతున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఇలా ఎందుకు చెబుతున్నామో దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది..!


Updated Date - 2023-06-23T17:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising