ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-02T23:21:09+05:30

ఒకప్పుడు సినిమాలకు అర్ధశతదినోత్సవం, శతదినోత్సవం అంటే ఓ రేంజ్‌లో ఉండేది. మా హీరో సినిమా అన్ని సెంటర్లలో అంటే.. మా హీరో సినిమా ఇన్ని సెంటర్లలో అంటూ రికార్డులను అభిమానులు షేర్ చేసుకుని

Balakrishna in Veera Simha Reddy Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒకప్పుడు సినిమాలకు అర్ధశతదినోత్సవం, శతదినోత్సవం అంటే ఓ రేంజ్‌లో ఉండేది. మా హీరో సినిమా అన్ని సెంటర్లలో అంటే.. మా హీరో సినిమా ఇన్ని సెంటర్లలో అంటూ రికార్డులను అభిమానులు షేర్ చేసుకుని సంబరాలు జరుపుకునే వారు. కానీ ప్రస్తుతం సినిమా 2 వారాలు థియేటర్లలో ఉంటే గొప్ప అన్నట్లుగా మారిపోయింది. దీనికి కారణాలు అనేకం. అయితే చాలా గ్యాప్ తర్వాత నందమూరి నటసింహం బాలయ్య (Natasimha Balakrishna) సినిమా 50 రోజుల కళను మళ్లీ తీసుకొచ్చింది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఎన్ని సెంటర్లలో అంటే..

ప్రస్తుత పరిస్థితుల్లో 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా థియేటర్లలో సినిమా నడవడం అరుదైన పెద్ద విజయం కిందే భావించాలి. ‘వీరసింహారెడ్డి’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 50 రోజుల (50 Days) రన్ పూర్తి చేసుకుని బాలయ్య స్టామినా ఏంటో మరోసారి చాటింది. ఈ చిత్రం 23 డైరెక్ట్, 54 షిఫ్టింగ్ థియేటర్లలో ఈ ఫీట్ సాధించింది. అంతేకాదు.. ఈ చిత్రం బాలకృష్ణకు హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. (Veera Simha Reddy Record)

వీరసింహారెడ్డి పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో.. బ్రీత్ టేకింగ్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే డ్రామా సమపాళ్లలో ఉండేలా తీర్చిదిద్దాడు. బాలకృష్ణ (Balakrishna) తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం


Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Updated Date - 2023-03-02T23:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!