Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

ABN , First Publish Date - 2023-02-27T18:56:24+05:30 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)లో చేసిన అతి తక్కువ సినిమాలతోనే మంచి నటీనటులుగా పేరు తెచ్చుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో లయ..

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ
Laya and Pawan Kalyan

తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)లో చేసిన అతి తక్కువ సినిమాలతోనే మంచి నటీనటులుగా పేరు తెచ్చుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో లయ (Laya) కూడా ఒకరు. హీరోయిన్‌గా ఆమె చాలా తక్కువ సినిమాలలోనే నటించింది. కానీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని.. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న లయ.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.

వాస్తవానికి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఏ సినిమాలో కూడా ఆమె నటించలేదు.. మరి అలాంటి లయ.. పవన్ కల్యాణ్ గురించి ఏం చెప్పి ఉంటుందనే ఆసక్తి కలగడం సహజమే. అయితే ఆమె చెప్పింది సినిమాలకు సంబంధించి కాదు. ఆమెను పవన్ కల్యాణ్ ఎలా సర్‌ప్రైజ్ చేశారో.. ఎలా మాట నిలబెట్టుకున్నారో.. అతనిది ఎలాంటి వ్యక్తిత్వమో చెప్పి.. ఇప్పుడు మెగాభిమానులందరినీ ఆమె ఖుషి చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పి ఉంటుందని అనుకుంటున్నారా..?

Kalyan.jpg

2006లో శ్రీ గణేష్‌ (Sri Ganesh)ని లయ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి (Laya Marriage) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని, పవన్ కల్యాణ్‌ని ఆమె ఆహ్వానించారట. అయితే, మెగాస్టార్‌తో తనకి అప్పటికి కాస్త పరిచయం ఉంది కానీ, పవర్‌స్టార్‌తో మాత్రం ఆమెకస్సలు పరిచయం లేదట. పవన్ కల్యాణ్‌కి కూడా తనెవరో తెలిసి ఉండకపోవచ్చుననీ భావిస్తూనే వెళ్లి శుఖలేఖ ఇచ్చారట. అపాయింట్‌మెంట్ కూడా లేకుండా వెళ్లిన లయని పవన్ కల్యాణ్ ఆహ్వానించిన తీరు, ఇన్విటేషన్ తీసుకుని.. తప్పకుండా వస్తానని ఆయన చెప్పిన తీరు.. చూసి ఆశ్చర్యపోయానని లయ తెలిపింది. అయినా కూడా.. తన పెళ్లికి చిరంజీవి వస్తారేమో కానీ.. పవన్ కల్యాణ్ రారనే ఆమె అనుకుందట.

కట్ చేస్తే.. తన పెళ్లికి గెస్ట్‌గా అందరి కంటే ముందే పవన్ కల్యాణ్ వచ్చేశారట. ఎటువంటి సమాచారం లేకుండా, చాలా సింపుల్‌గా ఆయన వచ్చారని.. కనీసం అతిథి మర్యాదలు చేసే అవకాశం కూడా తనకి ఇవ్వలేదని లయ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయన అలా రావడం.. ‘అన్నయ్య చిరంజీవిగారు కూడా వస్తున్నారమ్మా.. ఆన్ ద వే లో ఉన్నారు’ అని చెప్పడం.. నిజంగా తన జీవితంలో ఇప్పటికీ మధురమైన క్షణాలుగా భావిస్తానని లయ చెప్పుకొచ్చారు. మాట ఇచ్చినట్టే వచ్చి.. మమ్మల్ని సర్‌ప్రైజ్ చేశారని లయ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. మరోసారి పవన్ కల్యాణ్ గొప్పతనాన్ని (Pawan Kalyan Greatness) తెలియజేసిన లయకు మెగాభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

*********************************

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది


Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-27T23:06:04+05:30 IST