ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Radha And Pushpavalli : అతి కొద్దిమంది సమక్షంలో వంగవీటి రాధా-పుష్పవల్లిల నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే..!?

ABN, First Publish Date - 2023-09-03T22:12:24+05:30

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గత కొన్నిరోజులుగా దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) పెళ్లి (Radha Marriage) వార్త తెగ ట్రెండ్ అవుతోంది...

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గత కొన్నిరోజులుగా దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) పెళ్లి (Radha Marriage) వార్త తెగ ట్రెండ్ అవుతోంది. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపై కోడై కూస్తున్న పరిస్థితి. ఆదివారం నాడు అతికొద్ది మంది సమక్షంలో రాధా-పుష్పవల్లిల (Radha-Pushpavalli) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వేదికైంది. నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులు, నరసాపురం (Narasapuram) ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే హాజరయ్యారు. దీన్ని బట్టి చూస్తే నిశ్చితార్థ వేడుకకు పెద్దగా ఎవర్నీ ఆహ్వానించినట్లుగా లేరని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.ఈ పెద్దలంతా కాబోయే దంపతులను దీవించారు.


ఎవరీ పుష్పవల్లి..?

జక్కం పుష్పవల్లి స్వస్థలం నరసాపురం పట్టణం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి. నర్సాపురానికి చెందిన ఈ యువతి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగింది. పుష్పవల్లి తల్లిదండ్రులు బాబ్జి, అమ్మాణి టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అమ్మాణి గతంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ జనసేన గూటికి వెళ్లారు. ఇటు కాపు సంఘంలోనూ చురుగ్గా పని చేస్తున్నారు. ఇటీవల నరసాపురం పర్యటనలో పవన్‌కల్యాణ్‌ రెండు రోజులు జక్కం బాబ్జీ నివాసంలోనే బసచేశారు. ఈమె తండ్రి బాబ్జీ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక.. రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంపాటు వైసీపీలో ఉన్నారు. తర్వాత దాన్ని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల దూరంగా తటస్థంగా ఉంటున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే రెండుసార్లు టీడీపీ యువనేత నారా లోకేశ్‌తో రాధా చర్చలు జరిపారు. రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పెళ్లి ఎప్పుడంటే..?

వాస్తవానికి.. ఆగస్టు- 19నే నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ 3న నిశ్చితార్థం నిర్వహించారు. వంగవీటి రాధా- పుష్పవల్లిల వివాహం అక్టోబరు 22న సాయంత్రం 7:59 గంటలకు వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే.. నిశ్చితార్థం సింపుల్‌గా చేసుకున్నప్పటికీ పెళ్లి వేడుకకు మాత్రం అంగరంగ వైభవంగా జరపబోతున్నారట. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు.. వంగవీటి రంగ ఆప్తులు, ఆత్మీయులు.. అనుచరులు ఇలా ఏ ఒక్కర్నీ తప్పుకుండా ఆహ్వానించే యోచనలో రాధా ఉన్నట్లు ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. కాగా.. పుష్పవల్లి నర్సాపురం, హైదరాబాద్‌లలో చదువుకున్నారు. ఆమె యోగా టీచర్‌గా పని చేశారని కొందరు చెబుతుండగా.. ఓ ప్రముఖ విద్యా సంస్థలకు అన్నీ తానై చూసుకుంటున్నారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి


MLA Seethakka : ‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు’ అంటూ ఏడ్చేసిన ఎమ్మెల్యే సీతక్క..!


TS Assembly Polls : ఎన్నికల సమయంలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు.. ఎన్నికోట్లు ఇచ్చిందంటే..?


Land On Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..


Massive Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు



Updated Date - 2023-09-03T22:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising