Land On Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..

ABN , First Publish Date - 2023-09-03T16:15:34+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది..

Land On Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..

అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది. దీంతో భవిష్యత్ అవసరాల కోసం చంద్రుడిపై భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. చంద్రుడిపై నివాసయోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చంద్రుడిపై భూమి కొనుగోలు కోసం లూనార్ రిజిస్ట్రీ (Lunar Registry) అనే వెబ్‌సైట్‌ను కూడా అమెరికా అందుబాటులోకి తెచ్చింది. దీంతో చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు (Telugu States) చెందిన ప్రజలు చంద్రుడిపై భూమి కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


Land-At-Moon.jpg

ఇదీ అసలు కథ..

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్నారై బొడ్డు జగన్నాథరావు (NRI Boddu Jagannath Rao) చంద్రుడిపై భూమి కొన్నారు. తన కుమార్తెల కోసం రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్వయంగా న్యూయార్క్‌లోని లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ ఆఫీసుకు కుమార్తెలతో కలిసి వెళ్లిన ఆయన.. మానస, కార్తీక పేరిట చెరో ఎకరం భూమి కొనుగోలు చేయగా.. రిజిస్ట్రేషన్‌ క్లెయిమ్‌ డీడ్‌ ఇచ్చింది. ఉద్యోగరీత్యా న్యూయార్క్‌లో సెటిల్‌ అయిన జగన్నాథరావు 2005లో ఇంటర్నేషనల్‌ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నాడు. చంద్రునిపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ క్లెయిమ్‌ డీడ్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్ధ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2005లో తన కుమార్తెలు మానస, కార్తీక పేరిట చంద్రుడిపై చెరో ఎకరం భూమి కొనుగోలు చేశారు. 18 ఏళ్ల క్రితమే చంద్రుడిపై భూమి కొనుగోలు చేశానని జగన్నాధ రావు స్వయంగా వెల్లడించారు. తాను అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమి కొనుగోలు చేసినట్లు కూడా సరిగ్గా ప్రదేశంతో సహా చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు లూనార్ ల్యాండ్స్ స్పష్టంగా పేర్కొంటూ జగన్నాథరావుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. సర్టిఫికెట్ రావడంతో జగన్నాథరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ రెండు ఎకరాలకోసం ఎంత ఖర్చుపెట్టారనే విషయాలు మాత్రం బయటికి రాలేదు.

Jagannath-Rao.jpg

ఇటీవలే తెలంగాణ మహిళ ఇలా..?

ఇటీవలే.. తెలంగాణకు చెందిన ఎన్నారై సాయి విజ్ఞత (Sai Vignatha) అనే మహిళ ఎకరం భూమి కొనుగోలు చేయగా.. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం విశేషం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్ర, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవాలో నివసిస్తోంది. ఆమె గవర్నర్ కిమ్ రెనాల్డ్స్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో చంద్ర మండలంపై స్థలం కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా మొన్నటివరకు పెండింగ్‌లో ఉంది. ఈనెల 23న సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, తన కూతురు ఆర్త సుద్దాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లు అందాయి. మొత్తంగా చంద్రుడిపై ఎకరం స్థలం సాయి విజ్ఞత కొనుగోలు చేసింది. చంద్ర మండలంలో ఎకరం స్థలం ఇప్పుడు రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. కాగా.. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-3 అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.

Land-On-Moon.jpg

ఎలా కొనాలి..?

కాగా.. చంద్రుడి భూమిన ఎలా కొనాలి..? ఎంతకు కొనాలి..? ఎంతవరకూ కొనొచ్చు..? అనే విషయాలు లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు పూర్తి సమాచారంతో అందిస్తున్నాయి. చంద్రునిపై ప్రయోగాలు, చంద్రమండల ప్రదేశాలపై అన్వేషణ, అభివృద్ధి, పరిశోధనలకు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయంగా క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టేందుకు లూనార్‌ రిపబ్లిక్‌ సొసైటీ. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరుకు చెందిన పలువురు జాబిల్లిపై భూమి కొనుగోలు చేయగా.. ఇటీవల తెలంగాణ మహిళ, ఇప్పుడు కృష్ణావాసి కొన్నారు. భూమి కొన్న ఈ ఇద్దరూ ఎన్నారైలే. అయితే.. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయాలంటే లూనార్ రిజిస్ట్రీ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకుని.. కేవలం డాలర్ల రూపంలోనే లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి


Massive Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు


BRS MLA Candidates : టికెట్ ఇచ్చాక కేసీఆర్ సీక్రెట్ సర్వే.. కేటీఆర్ వచ్చాక ఆ 20 స్థానాల్లో మార్పులు..!?


Uppal BRS : అనుచరులు, అభిమానులతో భేటీ తర్వాత ఎమ్మెల్యే భేతి తీసుకున్న నిర్ణయం ఇదీ..!


BRS First List : బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో మరో సీనియర్ ఎమ్మెల్యే.. కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి..!


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


Updated Date - 2023-09-03T16:20:11+05:30 IST