BRS First List : బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో మరో సీనియర్ ఎమ్మెల్యే.. కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి..!

ABN , First Publish Date - 2023-08-29T11:54:28+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి.! కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్.. గెలుపు వ్యూహాల్లో ఉన్నారు...

BRS First List : బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో మరో సీనియర్ ఎమ్మెల్యే.. కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి.! కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్.. గెలుపు వ్యూహాల్లో ఉన్నారు. అయితే.. వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే తమకి టికెట్లు దక్కలేదని సిట్టింగులు.. ఈసారైనా టికెట్లు వస్తాయని ఆశించిన దక్కకపోవడంతో ఆశావాహులు.. మాజీలు, ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిని ప్రగతి భవన్‌కు (Pragathi Bhavan) పిలిపించి పంచాయితీలు పెట్టినా కొలిక్కిరావట్లేదు. మల్కాజిగిరి, ఖానాపూర్, జనగామ, నర్సాపూర్, ములుగు నియోజకవర్గాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి, అసమ్మతితో రాజకీయం రసకందాయంలో పడింది. ఇవన్నీ ఇలా నడస్తుండగానే.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే మరో సీనియర్ ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


Bhethi.jpg

ఇంతకీ ఎవరాయన..?

బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఆ సీనియర్ ఎమ్మెల్యే మరెవరో కాదు.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy). సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈయన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి (Bandaru Lakshma Reddy) సీటిచ్చింది అధిష్టానం. దీంతో ఉప్పల్ బీఆర్ఎస్‌లో అసమ్మతి రాజుకున్నది. బీఆర్ఎస్‌కు చెప్పేసి కాంగ్రెస్ తరఫున పోటీచేయాలని అనుచరులు, వీరాభిమానులు, కార్యకర్తలు భేతిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే సుభాష్ రెడ్డికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా ఆహ్వానించాయి. ఈ క్రమంలో పార్టీలో ఉండాలా.. వద్దా..? ఒకవేళ కొనసాగితే అధిష్టానం మనకు ఏమిస్తుంది..? ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ఏ పార్టీలోకి వెళ్లాలి..? అనేదానిపై నియోజకవర్గ నేతలు, అనుచరులు, అభిమానులతో చర్చించనున్నారు. ఉప్పల్‌లో ఇవాళ నేతలు, అనుచరులతో భేతి సమావేశం అవుతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని భేతి సుభాష్ రెడ్డి భావిస్తున్నారు. అయితే దాదాపు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రధాన అనుచురులు చెబుతున్నారు. పార్టీలో ఉంటారా..? లేదా..? అనేది ఇవాళ సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ గుడ్ బై చెబితే మాత్రం కేసీఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా.. గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేసిన నేత కావడమే ఇందుకు ఉదాహరణ అని కొందరు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. భేతి పార్టీ మారితే మాత్రం కచ్చితంగా ఫలితాలు తారుమారు అవుతాయని స్థానికులు చెప్పుకుంటున్నారు.

Bonthu-Rammohann.jpg

టికెట్ ఫైట్.. చివరికిలా..!

ఉప్పల్‌ టికెట్‌ కోసం బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభా‌ష్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ (Bonthu Rammohan), బండారి లక్ష్మారెడ్డి ముగ్గురూ ఢీ అంటే ఢీ అన్నారు. అయితే.. బొంతుకే టికెట్ ఇవ్వాలని వివిధ వర్గాల ప్రజలు, సంఘాలు, సామాజిక వర్గాలు, తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్ అండ దండలు కూడా మెండుగా ఉండటంతో కచ్చితంగా టికెట్ దక్కుతుందని అనుకున్నారు. కానీ.. ఈ ఇద్దర్నీ కాదని బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం గమనార్హం. బండారి.. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు అత్యంత సన్నిహితుడు. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు. ఈసారి టికెట్‌ తనకే వస్తుందని.. పలుమార్లు మీడియా ముందే ధీమాగా చెప్పారు కూడా.

Bandari-Lakshma-Reddy.jpg

టికెట్లు కోల్పోయింది వీరే..

కాగా.. భేతి సుభాష్ (ఉప్పల్)తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయిన రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), రాములు నాయక్ (వైరా), రేఖా నాయక్ (ఖానాపూర్), చెన్నమనేని రమేష్ (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి), రాథోడ్ బాపురావు (బోధ్), విద్యాసాగర్ రావు (కోరుట్ల) లకు టికెట్లు రాలేదు. వీరిలో రాజయ్య ఎప్పుడు బీఆర్ఎస్‌కు ఎప్పుడు గుడ్ బై చెబుతారో తెలియని పరిస్థితి. ఇక కామారెడ్డి నుంచి సీఎం కేసీఆరే పోటీచేస్తున్నారు. ఇక చెన్నమనేని రమేష్‌కు వ్యవసాయ సలహాదారు పదవిని కట్టబెట్టారు. రేఖా నాయక్ రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరిపోనున్నారు. కోరుట్ల నుంచి విద్యాసాగర్ రావుకు కాకుండా ఆయన కుమారుడికి డాక్టర్ సంజయ్ కుమార్‌కు దక్కింది. ఇక మిగలిన వారు దాదాపు కాంగ్రెస్‌లో చేరడానికే సిద్ధమైపోయారు. ఇక మిగలిన.. భేతి సుభాష్ కూడా సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

KCR.jpg


ఇవి కూడా చదవండి


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


Updated Date - 2023-08-29T12:10:11+05:30 IST