BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

ABN , First Publish Date - 2023-08-28T17:11:45+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్.. గెలుపు వ్యూహాల్లో ఉన్నారు. అయితే.. వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే తమకి టికెట్లు దక్కలేదని సిట్టింగులు.. ఈసారైనా టికెట్లు వస్తాయని ఆశించిన దక్కకపోవడంతో ఆశావాహులు.. మాజీలు, ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారిని ప్రగతి భవన్‌కు (Pragathi Bhavan) పిలిపించి పంచాయితీలు పెట్టినా కొలిక్కిరావట్లేదు. మరోవైపు.. మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాల ఎంత కసరత్తు చేసినా కేసీఆర్‌కు ఏమీ తోచట్లేదట. ఈ తలనొప్పులన్నీ తగ్గక ముందే మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.


DK-Aruna-Vs-MLA.jpg

ఇదీ అసలు కథ..!

గద్వాల (Gadwal) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి (Bandla Krishna Mohan Reddy) హైకోర్టులో (High Court) భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయనపై పోటీచేసి, రెండోస్థానంలో నిలిచిన డీకే అరుణను (DK Aruna) ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.50 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్‌ ఖర్చుల కింద డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

dk-aruna-1.jpg

కొత్త అభ్యర్థి కావాల్సిందేనా..?

కాగా.. హైకోర్టు తీర్పును కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇందులో సంచలన అంశాలను పేర్కొంది. బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. అయితే.. ఈ ఎన్నికల్లో గద్వాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలో పడింది. పక్కాగా ఇప్పుడు ఈ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే. మరోవైపు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బండ్లకు అధిష్టానం సలహా ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. ఇలా 2018 ఎన్నికల్లో గెలిచన అభ్యర్థులపై హైకోర్టులో 20కిపైగానే పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో చాలా మందికే కేసీఆర్ టికెట్లు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటో.!

telangana-highcourt.jpg

కేసు పూర్వపరాలు ఇవీ..

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ పోటీచేశారు. లక్ష ఓట్లతో ఘనవిజయం సాధించిన కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీకే అరుణ ఆయన సమీప ప్రత్యర్థిగా 71,612 ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, ఇతర వివరాలను తప్పుగా వెల్లడించారని, ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ డీకే అరుణ 2019 జనవరి 30న హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌(ఈపీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. అరుణ తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో.. గద్వాల మండలం పుద్దూరులో 24.09 ఎకరాలకు యజమానిగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి.. ఆ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని వివరించారు. హైకోర్టుకు గతంలో సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆ భూములు తనవేనని వెల్లడించినట్లు గుర్తుచేశారు. గద్వాల ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఖాతాల వివరాలు.. వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు, రుణాల వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. ప్రతివాది, ఆయన భార్య వాహనాలపై ట్రాఫిక్‌ చలానాలున్నాయని.. వాటిని చెల్లించలేదని, ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు.

KCR.jpg


ఇవి కూడా చదవండి


NTR Coin : ఎన్టీఆర్ 100 నాణెం విడుదల వేడుకకు తారక్ వెళ్తున్నారా.. లేదా..!?



TS Assembly Polls : బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ బట్టబయలు.. ఖమ్మం సభ తర్వాత మాస్టర్ ప్లాన్ ఇచ్చిన అమిత్ షా..!


Congress And Communists : తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ బంపరాఫర్.. అంతా ఓకేగానీ..!?


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?


TS Assembly Polls : ఎన్నికల ముందు ఈ పరిణామాలు దేనికి సంకేతం.. కేసీఆర్ మారిపోయారా.. భయపడ్డారా..!?



Updated Date - 2023-08-28T17:15:59+05:30 IST