Uppal BRS : అనుచరులు, అభిమానులతో భేటీ తర్వాత ఎమ్మెల్యే భేతి తీసుకున్న నిర్ణయం ఇదీ..!

ABN , First Publish Date - 2023-08-29T13:27:10+05:30 IST

ఉప్పల్ టికెట్ (Uppal Ticket) దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy).. నియోజకవర్గ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటన్నరపైగా భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు..

Uppal BRS : అనుచరులు, అభిమానులతో భేటీ తర్వాత ఎమ్మెల్యే భేతి తీసుకున్న నిర్ణయం ఇదీ..!

ఉప్పల్ టికెట్ (Uppal Ticket) దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy).. నియోజకవర్గ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటన్నరపైగా భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు. అభిమానులు, అనుచరులు, నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను ఓపిగ్గా తీసుకున్న ఆయన.. వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు భేతి సూటి ప్రశ్నలు సంధించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.


Bhethi-S.jpg

సారూ సమాధానాలివ్వండి!

వారం రోజుల్లో ఉప్పల్ టికెట్‌పై పునరాలోచన చేయకుంటే కచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కేసీఆర్‌కే (CM KCR) ఆల్టిమేటం ఇచ్చారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఉప్పల్‌లో గులాబీ జెండా పట్టినా. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు బిఆర్ఎస్ లోనే ఉన్నా. నియోజక వర్గంలో పార్టీని కాపాడినా. 2009లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసినా. నాపై కేసులు పెట్టినా భయపడకుండా ముళ్ల బాటలో నడిచినా. 2014లో ఇప్పుడు టికెట్ దక్కిన వ్యక్తికి డిపాజిట్ రాలేదు. ఆ ఎన్నికల్లో నాకు 60వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2018లో నేను 48వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా. ఈ పీరియడ్‌లో రెండేళ్లు కరోనా ఇబ్బంది పెట్టగా కేవలం రెండేళ్లలో చాలా అభివృద్ది పనులు చేసినా. ఇంకా ఐదేళ్లు అవకాశం లభిస్తే మరింత అభివృద్ధి చేయాలని భావించా. నేను ప్రతీరోజు ప్రజల్లోనే ఉన్నా. నేను ప్రజల్లో లేను అనడానికి కారణం. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కూడా కార్పొరేటర్లు ఓడిపోయారు. నా దగ్గర కేవలం నాలుగు మాత్రమే ఓడిపోయారు. కానీ నా దగ్గరనే ఓడినట్లు ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు..? అని కేసీఆర్‌పై భేతి ప్రశ్నలు సంధించారు.

Bhethi.jpg

నేనేం తప్పు చేశానో చెప్పండి..!

ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఆయన ఏనాడైనా పార్టీ జెండా మోసిండా..?. ఆయన ఏం చేశారని టికెట్ ఇచ్చారో చెప్పాలి..?. నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. బీఎల్‌ఆర్ ట్రస్ట్ పేరిట మాత్రమే పనులు చేశారు. కాంగ్రెస్ జెండా పెట్టీ డబ్బులు పంచిన వారికి టికెట్ ఎలా ఇచ్చారో చెప్పాలి..?. కాంగ్రెస్ నేత రాజిరెడ్డి ఫోటో పెట్టుకుని పని చేశాడు. బీఆర్ఎస్ నేతల ఫోటోలు లక్ష్మారెడ్డి ఏ రోజు పెట్టలేదు. 29నియోజకవర్గాల్లో నా ఒక్కనికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు. నేను ఏం తప్పు చేశానో చెప్పండి. ఒక్క ఉద్యమకారున్ని ఉంటే అన్యాయం ఎందుకు చేశారు..?. దళిత బందులో అవినీతి చేశానా? నేను ఏమైనా తప్పు చేశానా?. దేని కోసం నాకు టికెట్ ఇవ్వ లేదు.. నేను చేసిన తప్పు ఏంటి?. ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. వారం రోజులైనా ఎందుకు ఇవ్వలేదో చెప్పడం లేదు నాతో మాట్లాడటం లేదు. నన్ను ఎందుకు బలి చేశారు..?. నేను ఇప్పుడు ఏం చేయాలి..నా వెంట ఉన్న వారి పరిస్థితి ఏంటి..?. ఫ్యామిలీ మొత్తం ధర్నా చేద్దామని నా ఫ్యామిలీ చెబితే వద్దని వారించాను..అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ భేతి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Bandari-Lakshma-Reddy.jpg

చివరి ఛాన్స్ కూడా లేదు..!

ఉరి తీసే వారికి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎమ్మేల్యే అయ్యి అందరూ ఆస్తులు సంపాదిస్తే నేను ఆస్తులు అమ్ముకున్నాను. గుండా పని చేసిన వారికి అన్యాయాలు చేసిన వారికి టికెట్ ఇచ్చారు. కానీ ఏ తప్పు చేయని నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు..?. మార్పుల్లో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా.. ఇంకా ఎదురు చూస్తున్నా. ఇంకా అప్పుడే ఏం కాలేదు మరో వారం రోజులు ఎదురు చూస్తాను. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. నా ప్రజల కోసం నేను ప్రజల్లోనే ఉంటాను అని కేసీఆర్ సర్కార్‌కు భేతి అల్టిమేటం జారీ చేశారు. కాగా.. ఉప్పల్ టికెట్ భేతి, బొంతు రామ్మోహన్‌ను కాదని బండారి లక్ష్మారెడ్డికి ఇచ్చిన విషయం విదితమే. బండారి.. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. అయితే భేతిని మాత్రం అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ రెండు పార్టీలు ఆహ్వానించాయి. వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది..? భేతి అడుగులు ఎటువైపు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bhethi-Final.jpg


ఇవి కూడా చదవండి


BRS First List : బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో మరో సీనియర్ ఎమ్మెల్యే.. కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరి..!


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


Updated Date - 2023-08-29T13:30:24+05:30 IST