ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘గృహ‘మస్తు

ABN, Publish Date - Dec 17 , 2023 | 03:17 PM

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మరో గ్యారెంటీ గృహజ్యోతి.

  • గృహజ్యోతి పథకానికి ఏటా రూ.4 వేల కోట్లు

  • నెలకు 200 యూనిట్లలోపు కరెంటు ఉచితం

  • రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కనెక్షన్లు 1.5 కోట్లు

  • ఇందులో డొమెస్టిక్‌ కనెక్షన్లు 1.2 కోట్లు

  • 200 యూనిట్లలోపు వాడే సంఖ్య సుమారు కోటి

  • ఈ లెక్కన నెలకు రూ.350 కోట్ల భారం

  • విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు

  • ముందుగా విద్యుత్‌పై నిపుణులతో కమిటీ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మరో గ్యారెంటీ గృహజ్యోతి. నెలకు 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు అందించే పథకం. వందరోజుల్లో ఆరింటిని అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ప్రజలు ఉచిత కరెంటుపై ఆశగా ఉన్నారు. ఈనెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి రాగా, మరో నాలుగింటి అమలుకు ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు కోటిన్నర కరెంట్‌ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.2 కోట్ల గృహ (డొమెస్టిక్‌) కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లు దాదాపు కోటి.

నెలకు రూ.350 కోట్లు

గృహజ్యోతి పథకం అమల్లోకి వస్తే విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని విద్యుత్‌ సంస్థల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది వినియోగదారులకు లబ్ధి కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలు, పలు సంస్థల నుంచి తీసుకున్న అప్పులు మొత్తం రూ.85 వేల కోట్ల వరకు ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌పై నిపుణులతో కమిటీ వేసి ఆ తర్వాత విధివిధానాలు రూపొందించి గృహజ్యోతి పథకం అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

గ్రేటర్‌లో రికార్డుస్థాయి కనెక్షన్లు

గ్రేటర్‌ జోన్‌ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా మొత్తం 59 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్‌, హెచ్‌టీ కనెక్షన్లు 7 లక్షల వరకు కాగా, మిగిలినవి డొమెస్టిక్‌ కనెక్షన్లు. మొత్తం గృహ విద్యుత్‌ వినియోగదారుల్లో 40 లక్షల కనెక్షన్‌దారులు ప్రతినెలా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ లెక్కన ‘గృహజ్యోతి’ని అమలుచేస్తే ప్రతినెలా గ్రేటర్‌ నుంచి రూ.200 కోట్ల అదనపు భారం పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే వాటర్‌బోర్డు నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌కు రూ.4 వేల కోట్లు విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో ‘గృహజ్యోతి’ని అమల్లోకి తెస్తే మరింత భారం పడనుందని విద్యుత్‌ శాఖ లెక్కలు వేస్తోంది.

100-150 యూనిట్లు వాడేవారు అధికం

గ్రేటర్‌ పరిధిలో 40 లక్షల గృహ కనెక్షన్లలో 35 లక్షల కనెక్షన్‌దారులు ప్రతినెలా 100-150 యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తుంటారు. 100 యూనిట్ల లోపు 2-3 లక్షల కనెక్షన్లు, 200 యూనిట్లపైన మరో 2-3 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కలు ప్రతినెలా మారుతుంటాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు సాధారణం కంటే 30-40 శాతం విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా నమోదవుతుంది. గ్రేటర్‌ జోన్‌ నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌కు గృహ విద్యుత్‌, వాణిజ్య, హెచ్‌టీ కేటగిరీలో ప్రతినెలా రూ.900-1200 కోట్ల విద్యుత్‌ బిల్లులు వసూలవుతాయి. డిస్కంకు వచ్చే ఆదాయంలో 65-70 శాతం కమర్షియల్‌, హెచ్‌టీ కనెక్షన్ల ద్వారా వస్తోంది.

కర్ణాటకలో ఇలా...

కర్ణాటకలో గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి కనెక్షన్‌కు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. గతంలో నెలనెలా ఆ గృహ వినియోగదారుడు ఎంత విద్యుత్‌ వినియోగించారో గుర్తించి దానికి మరో 15-20 శాతం అధనంగా వాడే వెసులుబాటు కల్పించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ అమల్లోకి తెస్తే 100, 150 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వాళ్లు కూడా 200 యూనిట్ల వరకు వినియోగించే అవకాశాలు పెరుగుతాయని, దీంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు లోడ్‌ పడి సరఫరాలో అంతరాయం తలెత్తే అవకాశాలుంటాయని ఇంజనీర్లు చెబుతున్నారు.

ఎస్పీడీసీఎల్‌

మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు - 1,01,14,526

గృహ విద్యుత్‌ కనెక్షన్లు - 75,19,810

200 యూనిట్లలోపు విద్యుత్‌ కనెక్షన్లు - 64,41,642

0-50 యూనిట్ల కనెక్షన్లు - 22,59,944

51-100 యూనిట్ల కనెక్షన్లు - 19,42,128

101-200 యూనిట్ల కనెక్షన్లు - 22,39,570

ఎన్పీడీసీఎల్‌

మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు - 58,57,899

గృహ విద్యుత్‌ కనెక్షన్లు - 39,30,246

200 యూనిట్లలోపు విద్యుత్‌ కనెక్షన్లు - 36,28,224

0-50 యూనిట్ల కనెక్షన్లు - 17,71,772

51-100 యూనిట్ల కనెక్షన్లు - 11,68,268

101-200 యూనిట్ల కనెక్షన్లు - 6,88,184

Updated Date - Dec 17 , 2023 | 03:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising