ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Polls 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక.. బీఆర్ఎస్ కీలక ప్రకటనలు

ABN, First Publish Date - 2023-10-09T18:24:19+05:30

తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది..

తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది.


ఏం జరగబోతోంది..?

అక్టోబర్-15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా.. అభ్యర్థులందరికీ బీ-ఫారాలను అందజేయనున్నారు. అదే రోజే బీఆర్ఎస్ మేనిఫెస్టోను (BRS Manifesto) స్వయంగా గులాబీ బాసే రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ముగిశాక.. అక్టోబర్-15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల్లో బాస్ పర్యటించబోతున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్-09న అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం కేసీఆర్.. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత మొదట గజ్వేల్‌లో.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

ఎక్కడెక్కడ పర్యటన!

అక్టోబర్-15 : హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్-16 : జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో పాల్గొననున్న గులాబీ బాస్

అక్టోబర్-17 : సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్న కేసీఆర్

అక్టోబర్-18 : మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.

NCBN Case : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?


Updated Date - 2023-10-09T18:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising