ఓటు హక్కును వినియోగించుకున్న కొందరు సినీ సెలబ్రెటీలు
ABN, First Publish Date - 2023-11-30T13:43:59+05:30
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీనీ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
సినీ నటుడు నాగార్జున తన భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వద్ద పోలింగ్ బూత్ 151లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సీని హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని పోలింగ్ బూత్ 157లో ఓటు వేశారు.
సీని నటుడు గోపీచంద్ పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టాలీవుడ్ నటుడు జగపతిబాబు పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హీరో నానీ పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు.
Updated Date - 2023-11-30T13:44:01+05:30 IST