ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియాకొచ్చిన అమెరికా మహిళలకు ఊహించని అనుభవం.. ఓ కుర్రాడి సాయానికి అమె కళ్లల్లో నీళ్లు!

ABN, First Publish Date - 2023-02-26T18:19:55+05:30

అమెరికామహిళకు భారతీయ యువకుడి సాయం.. నెట్టింట వీడియో వైరల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మారుమోగాలంటే పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయక్కర్లేదు. ఇండియాకొచ్చే విదేశీ అతిథులకు ఏ లోటూ రాకుండా చూసుకుంటే చాలు.. వాళ్లే భారత్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఓ భారతీయ యువకుడిని చూసి నెటిజన్లు ప్రస్తుతం ఇదే కామెంట్ చేస్తున్నారు. అతడు ప్రస్తుతం నెట్టింట్లో హీరో అయిపోయాడు. ఆ యువకుడి సాయానికి అబ్బురపడ్డ ఓ విదేశీ మహిళ సోషల్ మీడియా వేదికగా మనోడిని తెగ పొగిడేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన స్టేఫ్ అనే మహిళ(American woman) ఇటీవల భారత పర్యటనకు(India tour) వచ్చింది. అయితే.. గుజరాత్‌లో రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తన పర్సు(Wallet lost) అక్కడే పెట్టి మర్చిపోయింది. స్టేషన్‌లో దిగిపోయాక గానీ ఆమెకు పర్సు విషయం గుర్తుకు రాలేదు. గుజరాత్‌కు చెందిన చిరాగ్ అనే యువకుడు ఆమెను ఇన్‌స్టా వేదికగా సంప్రదించాడు. ‘‘మీ పర్సు నాదగ్గరే ఉంది వచ్చి తీసుకెళ్లండి అని చెప్పాడు. పర్సు పోయినట్టే అని ఆమె అనుకుంటున్న నమయంలో ఆ యువకుడి నుంచి మెసేజ్ రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

ఆ తరువాత స్టెఫ్.. చిరాగ్ సూచనల మేరకు గుజరాత్‌లో(Gujarat) భుజ్ ప్రాంతంలో అతడి రెస్టారెంట్‌కు చేరుకుంది. అక్కడ చిరాగ్ ఆమెకు పర్సు అప్పగించాడు. పోయిన పర్సు తిరిగొచ్చినందుకు తెగ సంబరపడిపోయిన ఆమె చిరాగ్‌కు టిప్ కింద కొంత మొత్తం ఇచ్చేందుకు ప్రయత్నించగా అతడు సున్నితంగా వారించాడు. తనకు డబ్బు ఇవ్వక్కర్లేదని, పర్సు జాగ్రత్తగా దాచిపెట్టుకోమని ఆమెకు సలహా ఇచ్చి పంపించాడు. కాగా.. చిరాగ్ తనకు పర్సు తిరిగిస్తుండగా తీసిన వీడియోను(Viral Video) అమెరికా మహిళ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తనకు ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి ఇంతటి సాయం చేసినందుకు కృతజ్ఞతతో ఆమె కళ్లు చెమర్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-02-26T18:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising