ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: సింగపూర్‌లో‌ ‘సిరిజోత’ ప్రదర్శన.. వెండితెరపై విడుదలైన తొలి తెలుగు లఘు చిత్రంగా గుర్తింపు

ABN, First Publish Date - 2023-01-17T16:36:49+05:30

శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన సిరిజోత లఘు చిత్రాన్ని నిన్న రాత్రి సింగపూరు ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్‌లో ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శబ్ద కాన్సెప్ట్స్(Sabhda Concepts) బ్యానర్‌పై నిర్మించిన సిరిజోత(Sirijotha) లఘు చిత్రాన్ని నిన్న రాత్రి సింగపూరు ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కథ, మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించారు. సురేష్ రాజ్ దర్శకత్వంలో అభిరాం, విజయ భరత్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం యూ ట్యూబ్‌లో ఈ రోజు విడుదలైంది. తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపొందించిన ఈ చిత్రాన్ని సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రముఖులందరూ చూసి తమ అభినందనలు తెలియజేసారు. అలాగే తెలుగు భాషాభిమానులందరూ తప్పక చూడాల్సిన చిత్రమంటూ ప్రశంసించారు.

శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు రాంబాబు పాతూరి, సింగపూర్ తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు రంగ రవి, సింగపూర్ పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు సునీత తదితర ప్రముఖులందరూ తమ చిత్రాన్ని చూసి అభినందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాత సుబ్బు పాలకుర్తి పేర్కొన్నారు. సింగపూర్‌లో(Singpore) వెండి తెరపై ప్రదర్శించిన మొట్టమొదటి తెలుగు లఘు చిత్రం తమదే కావడం.. అందులోనూ తెలుగు భాషపై నిర్మించిన చిత్రం కావడం మరింత ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. ఈ లింక్ ద్వారా చిత్రాన్ని య్యుట్యూబ్‌లో చూడగలరు

Updated Date - 2023-01-17T16:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising