ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veera Simha Reddy: షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానుల సందడి

ABN, First Publish Date - 2023-01-13T07:35:43+05:30

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు 'వీరసింహారెడ్డి' ప్రీమియర్ షోలో సందడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్లెట్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు 'వీరసింహారెడ్డి' ప్రీమియర్ షోలో సందడి చేశారు. పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర, షార్లెట్ బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో వీరసింహారెడ్డి ప్రీమియర్ షో సందర్భంగా కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంలో ప్రీమియర్ షోను వీక్షించారు. ఈ సందర్బంగా పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, దేవరాజ్ మాట్లాడుతూ... భారతదేశం RRR సినిమా గెలిచిన 'గోల్డెన్ గ్లోబ్ అవార్డు'ను పండుగగా జరుపుకుంటోందని, ఈ ఫీట్ కోసం భారతీయుడిగా మనం గర్వపడాలి అని అన్నారు. తెలుగువారిగా మనం కొంత గర్వంగా భావించాలి కానీ అహంకారం కాదు అని తెలిపారు.

ఇక బాలయ్య అభిమానులుగా తాము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న రెండు తెలుగు సినిమాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేర్ వీరయ్య' బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. తెలుగు ఖ్యాతి విశ్వవిఖ్యాతం అవుతున్న రోజుల్లో దయచేసి రాజకీయ లాభాల కోసం సమాజాన్ని విభజించవద్దని కోరారు. ఒకరిద్దరు వ్యక్తులు అపరిపక్వతతో గొడవ పడితే అబద్ధాలు జోడించి తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఒకరిద్దరు వ్యక్తులు సమాజాన్ని ప్రతిబింబించరని గుర్తు చేశారు. అందరీ అభిమానులు, అన్ని కులాలు, అన్ని పార్టీల ప్రజలు యూఎస్ఏ (USA)లో మంచి సామరస్యంతో కలిసి జీవిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-01-13T08:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising