ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: సింగపూర్‌లో ఘనంగా తెలుగువారి పండుగ

ABN, First Publish Date - 2023-01-31T17:42:01+05:30

సింగపూర్‌లో కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యముల గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సొంత నేలకు దూరంగా సింగపూర్‌లో నివసిస్తున్న కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులందరూ కలిసి సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్‌లో (SUTD) ఈ రోజు (29-01-2023) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు హాజరైన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు ఆ 4 రోజులూ జరుపుకునే పండుగ సాంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను అతి చక్కగా పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితో కలిపి జరుపుకుంటున్న 2వ అతి పెద్ద పండుగ ఇదేనని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం ద్వారా మరింత మంది సాటి తెలుగు వారు సన్నిహుతులు అయ్యారని అలాగే విభిన్నమైన ఆటలద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమ రూపకల్పన చక్కగా ఉందని పలువురు ప్రశంసించారు.

Updated Date - 2023-01-31T17:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising