ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: చైనా వారిని వెనక్కు నెట్టిన భారతీయులు..సింగపూర్‌లో ఇప్పుడు..

ABN, First Publish Date - 2023-01-03T21:30:48+05:30

సింగపూర్‌ను సందర్శిస్తున్న పర్యాటకుల్లో భారతీయులు సంఖ్యాపరంగా రెండో స్థానానికి ఎగబాకారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: సింగపూర్‌ను(Singapore) సందర్శిస్తున్న పర్యాటకుల్లో భారతీయులు(Indian tourists) సంఖ్యాపరంగా రెండో స్థానానికి ఎగబాకారు. చైనీయులను వెనక్కు నెట్టి మరీ నెం.2 స్థానాన్ని దక్కించుకున్నారు. కరోనాకు పూర్వం చైనా పర్యాటకులే(Chinese) అత్యధిక సంఖ్యలో సింగపూర్‌ను సందర్శించే వారు. 2022 నవంబర్ నాటికి సింగపూర్ సందర్శించిన భారతీయు సంఖ్య 612,300 అని సింగపూర్ టూరిజం బోర్డు తెలిపింది. సింగపూర్‌లో ఎక్కువ రోజుల పాటు పర్యటిస్తున్న వారు కూడా భారతీయులే కావడం గమనార్హం. భారతీయులు సగటున 8.61 రోజుల పాటు దేశంలో పర్యటించారట. ఇక ఇండోనేషియన్లు సగటున 4.66 రోజులు, మలేషియన్లు 4.28, ఆస్ట్రేలియన్లు 4.05 రోజుల పాటు సింగపూర్‌లో గడిపారు. గతేడాది నవంబర్‌‌తో ముగిసిన సంవత్సరంలో 9,86,900 మంది విదేశీయులు సింగపూర్‌ను సందర్శించగా.. వీరిలో ఇండోనేషియా(Indonesia) టూరిస్టులు సంఖ్యాపరంగా మొదటి స్థానంలో నిలిచారు. కొవిడ్ సంక్షోభం తరువాత తొలిసారిగా 2022లో సింగపూర్ పర్యాటకం భారీగా పుంజుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-01-03T23:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising