ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన భారత సంతతి మహిళ.. 14 నెలల పాటు నిత్య నరకం..

ABN, First Publish Date - 2023-01-09T21:07:38+05:30

పనిమనిషిని చిత్ర హింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతి మహిళకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పనిమనిషిని(Domestic Help) చిత్ర హింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన భారత సంతతి(Indian Orgin woman) మహిళకు సింగపూర్ న్యాయస్థానం సోమవారం 14 ఏళ్ల కారాగార శిక్ష(14-Year Jail) విధించింది. నిందితురాలు ప్రేమ. ఎస్. నారాయణస్వామి ఆమె కూతురు పెడుతున్న బాధలు తాళలేక పనిమనిషి పియాంగ్ చనిపోయింది. మయాన్మార్‌కు చెందిన పియాంగ్ 2015లో నిందితుల వద్ద పనిలో చేరింది. ఆ తరువాత ప్రేమ నారాయణస్వామి, ఆమె కూతురు పియాంగ్‌ను చిత్రహింసలు పెట్టారు. ఒంటిపై వేడి నీళ్లు పోయడం, కొట్టడం, తన్నడం, జుట్టు పట్టి లాగడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. నేలపై పడేసి ఈడ్చారు. వారి చేతుల్లో పియాంగ్ నిత్య నరకం అనుభవించింది. కేవలం 14 నెలల్లోనే ఆమె బరువు 24 కేజీలకు పడిపోయింది. చివరి రోజుల్లో పియాంగ్‌ కాళ్లను గొలుసుతో కిటికీకి నిందితురాలు కట్టేసింది.

ఈ నరకం తాళలేక బాధితురాలు 2016 జులై 26న మరణించింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతోనే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడింది. అయితే.. పియాంగ్ వెతలన్నీ ఇంటిలోని సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుల బండారం బయటపడింది. తల్లీకూతుళ్లు చివరకు కటకటాలపాలయ్యారు. ప్రేమ నారాయణస్వామి కుమార్తెకు న్యాయస్థానం 2021లో 30 ఏళ్ల కారాగారా శిక్ష విధించింది. పనిమనిషి వేధింపుల కేసులో ఇంతటి భారీ శిక్ష విధించడం సింగపూర్ చరిత్రలో అదే తొలిసారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రేమకు సోమవారం శిక్ష ఖరారైంది.

Updated Date - 2023-01-09T21:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising