NRI: చైనాలో భారతీయ విద్యార్థి మృతి.. ప్రభుత్వ సాయం కోరిన కుటుంబం
ABN, First Publish Date - 2023-01-01T19:41:06+05:30
చైనాలో ఇటీవల మృతి చెందిన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోరింది.
ఎన్నారై డెస్క్: చైనాలో(China) ఇటీవల మృతి చెందిన భారతీయ వైద్య విద్యార్థి(Indian Medical Student) మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోరింది. తమిళనాడుకు చెందిన అబ్దుల్ షేక్(22) ఐదేళ్ల క్రితం మెడిసిన్ చదువుకునేందుకు చైనా వెళ్లాడు. ప్రస్తుతం అతడు కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన అబ్దుల్ డిసెంబర్ 11న మళ్లీ చైనాకు వెళ్లాడు. ఎనిమిది రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం..చదువులో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలోనే అబ్దుల్ అనారోగ్యానికి గురవడంతో వైద్యులు ఐసీయూఓలో ఉంచి చికిత్సను అందించారు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో అబ్దుల్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అబ్దుల్ కుటుంబం అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలంటూ విదేశాంగ శాఖను అభ్యర్థించింది. ఈ విషయంలో ఆదుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్నీ వేడుకుంది.
Updated Date - 2023-01-01T19:41:08+05:30 IST