ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: సౌదీ అరేబియా ఉక్కుపాదం.. వారంలోనే 15వేల మంది అరెస్ట్!

ABN, First Publish Date - 2023-01-02T10:32:02+05:30

చట్టాలు అతిక్రమించిన వారిపై సౌదీ అరేబియా(Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిని భారీ స్థాయిలో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: చట్టాలు అతిక్రమించిన వారిపై సౌదీ అరేబియా(Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిని భారీ స్థాయిలో సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని సెక్యూరిటీ అధికారులు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్టు అధికారులు సంయుక్తంగా దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22-28 మధ్య చట్టాలు ఉల్లంఘించిన 15,328 మందిని అరెస్ట్ చేశారు.

అరస్టైన వారిలో 8,808 మంది రెసిడెన్సీ నిబంధనలను(Residence violators)4,038 మంది బార్డర్ సెక్యూరిటీ చట్టాలను(Border security), 2482 మంది లేబర్ చట్టాల(Labor violators)ను అతిక్రమించినట్టు సౌదీ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన మరో 552 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ పౌరులను కూడా అధికారులు హెచ్చరించారు. ఎవరైనా చట్టాలను అతిక్రమించిన వారికి సహకరించి, వసతి ఏర్పాటు చేస్తే వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-02T10:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising