Health Tips: రోజూ పడుకునేముందు ముఖానికి దీన్ని రాసుకోండి చాలు.. 40 ఏళ్లలోనూ 20 ఏళ్ల వయసున్న వారిలా..!
ABN, First Publish Date - 2023-12-01T15:58:52+05:30
చిన్న స్ప్రే సీసాలో వేసి స్టోర్ చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేయడం వల్ల మొటిమల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
పెరుగుతున్న వయసు పెరుగుతున్న కొద్దీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ళకు చేరుతున్నవారిలో చర్మానికి సంబంధించి మరింత పోషణ అవసరం. దీనికోసం అలోవెరా సరిగ్గా సరిపోతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది మొటిమలు తగ్గి, చర్మాన్ని కాపాడుతుంది. మచ్చలను తగ్గిస్తుంది.
కలబంద అన్ని రకాల చర్మాలకు అనువైనది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి మెరిసే చర్మాన్ని ఇస్తుంది. కలబంద ముఖ చర్మంలో వన్న రంధ్రాలను, మొటిమలను, నయం చేయడంలో చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. అలోవెరా జెల్ రాత్రిపూట చర్మానికి పూయడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని వల్ల కలిగే అనేక ఉపయోగాలను గురించి తెలుసుకుందాం.
రాత్రిపూట అలోవెరా జెల్ ముఖానికి రాస్తే..
అలోవెరా జెల్ పొడిబారడం అనే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని మృతువుగా ఉంచడంలో సహాయపడతుంది. ముఖ్యంగా రాత్రి పూట కలబందను అప్లై చేయడం వల్ల సూర్యరశ్మి నుంచి వడదెబ్బ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది అన్ని చర్మ రకాలకు సరిపోతుంది, అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
మొటిమల సమస్య..
యాంటీ యాక్నే స్ప్రే చేయడానికి, 40 ML మినరల్ వాటర్, 3 టీస్పూన్ల కలబంద రెండు చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకోవాలి. దీనిని చిన్న స్ప్రే సీసాలో వేసి స్టోర్ చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేయడం వల్ల మొటిమల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మచ్చలను తొలగించడంలో కూడా సహకరిస్తుంది.
ఇది కూడా చదవండి: విపరీతంగా జుట్టు రాలుతోందా..? ఈ 3 వంటింటి చిట్కాలను కనుక పాటిస్తే సమస్యకు పులుస్టాప్ ఖాయం..!
వృద్ధాప్యం సంకేతాలు..
అలోవెరా చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై కనిపించే ముడతలను, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఫైన్ లైన్లను కూడా తొలగిస్తుంది.
చర్మం నిగారింపు..
రాత్రిపూట అలో జెల్‌ను చర్మంపై అప్లై చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి కొత్త కణాలు రావడమే కాకుండా చర్మాన్ని రిపేర్ చేస్తుంది. తాజాగా, కాంతివంతంగా మారుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-01T15:58:53+05:30 IST