Share News

Hair Fall: విపరీతంగా జుట్టు రాలుతోందా..? ఈ 3 వంటింటి చిట్కాలను కనుక పాటిస్తే సమస్యకు పులుస్టాప్ ఖాయం..!

ABN , First Publish Date - 2023-12-01T15:47:34+05:30 IST

ఎగ్ హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక చెంచా పెరుగు తీసుకుని అందులో గుడ్డు సొనను కలపాలి.

Hair Fall: విపరీతంగా జుట్టు రాలుతోందా..? ఈ 3 వంటింటి చిట్కాలను కనుక పాటిస్తే సమస్యకు పులుస్టాప్ ఖాయం..!
home remedies

ఎంత ఒత్తైన జుట్టున్నవారికైనా తప్పని పరిస్థితి జుట్టు రాలడం సమస్య. ఇప్పటిరోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నవారే. అయితే దీనికి చాలా కారణాలున్నాయి. సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం, అలాగే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం, కాలి కాలుష్యం కూడా జుట్టు రాలే సమస్యకు కారణం అవుతుంది. జుట్టు రాలడం, విరిగిపోవడం అనేది పెద్ద సమస్యే.

మారుతున్న వాతావరణానికి తగినట్టుగా జుట్టును కాపాడుకుంటూ రావాలి. ముఖ్యంగా చలికాలంలో జుట్టుకు మరింత పోషణ అవసరం. చలిగాలికి స్కాల్ప్ పొడిగా మారుతుంది. దీని వల్ల జుట్టుకు తేమ తగ్గి పాడవుతుంది. అంతేకాదు చుండ్రు సమస్య కూడా మొదలవుతుంది. ఈ సమస్యను తగ్గించడంలో ఇంటి నివారణలు జుట్టు రాలడాన్ని ఆపడానికి సరిగ్గా సరిపోతాయి. ఆ రెమెడీస్ ఏంటంటే..

జుట్టు రాలడం ఆపడానికి హోం రెమెడీస్...

గుడ్డు జుట్టు ముసుగు

జుట్టుకు తగిన పోషకాహారం, మాంసకృత్తులు అందించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి గుడ్డు హెయిర్ మాస్క్ అప్లై చేయవచ్చు. ఎగ్ హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక చెంచా పెరుగు తీసుకుని అందులో గుడ్డు సొనను కలపాలి. బాగా కలిపిన తర్వాత, ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టుపై అరగంట పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. జుట్టు రాలడం తగ్గడం మొదలవుతుంది.

ఇది కూడా చదవండి: కొబ్బరి కాయను సరిగ్గా సగానికి పగలగొట్టేందుకు అదిరిపోయే టెక్నిక్.. లోపల ఉన్న కొబ్బరిని కూడా ఈజీగా తీయాలంటే..!


కరివేపాకు ఉపయోగపడుతుంది.

కరివేపాకు జుట్టుకు మాత్రమే కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మెరపును కూడా తగ్గిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలంటే..కరివేపాకు మెత్తని ముద్దను తీసుకుని జుట్టుకు పట్టించి 20 నుంచి 30 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జట్టుకు మంచి పోషణ లభిస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేసి మరిగించి ఆ నూనెను రాసినా కూడా జుట్టు తెల్లబడదు. ఈ నూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వెంట్రుకలు దృఢంగా మారతాయి.

ఉల్లిపాయ రసం

వారానికి ఒకసారి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది.. ఉల్లిపాయ రసం తీసుకుని ఈ రసాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి తల చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. అలాగే ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి ఉల్లిపాయ నూనెను తయారు చేయవచ్చు. ఇది కూడా జుట్టు పెరుగుదలలో సహకరిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T15:47:36+05:30 IST