ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buttermilk: మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా? ఇలా చేస్తే కలిగే నష్టాల గురించి ఏమైనా తెలుసా..?

ABN, Publish Date - Dec 25 , 2023 | 01:32 PM

ఉప్పు కలపడం వల్ల మజ్జిగ తాగిన తరువాత నీరసం, అలసట, పొట్ట భారంగా అనిపించడం, అపాన వాయువు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల పొట్ట మీద చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటే.. పెరుగు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థం. ఇది ప్రేగు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.

stomach

ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని తీసుకుంటాం. చాలా వరకూ రుచికరంగా ఈ ఆహారం ఉండాలని చూస్తాం. అలాగే భోజనం తీసుకున్నాకా చివరిలో పెరుగుతిని ముగిస్తాం. ఇలా అలవాట్లు పూర్వం నుంచి వచ్చినవి. కాలం మార్పుతో మన ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మజ్జిగను రాత్రి భోజనంలో తీసుకోవడం ఎంతవరకూ ఆరోగ్యానికి సపోర్ట్ గా నిలుస్తుంది అనేది తెలియాలి.

మజ్జిగను తాగేవారు దీనిలో ఉప్పు కలుపుకుని తీసుకుంటారు. అలాగే మసాలాలను, పుదీనా చట్నీని కూడా మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచే ప్రేగులలోని బ్యాక్టీరియాను ఇది దెబ్బతీస్తుంది. పొట్టకు హాని కలిగిస్తుంది. అందుకే పొరపాటున కూడా ఉప్పును కలిపిన మజ్జిగను తీసుకోకూడదు.

మజ్జిగలో ఉప్పు కలిపితే..

ఉప్పు కలపడం వల్ల మజ్జిగ తాగిన తరువాత నీరసం, అలసట, పొట్ట భారంగా అనిపించడం, అపాన వాయువు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల పొట్ట మీద చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మంచి బ్యాక్టీరియాపై దాడి..

ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటే.. పెరుగు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థం. ఇది ప్రేగు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పెరుగులో ఉండే లక్షణాలే మజ్జిగ, లస్సీలలో ఉంటాయి. అయితే ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నెమ్మదిగా ఈ బ్యాక్టీరియా చనిపోతుంది.

ఇది కూడా చదవండి: పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ.. ఈ విషయాలను మాత్రం మరిచిపోకండి..!


పెరుగు ప్రయోజనాలు చెప్పిన ఆయుర్వేదం..

పుల్లగా ఉండే పెరుగును తీసుకోవడం వల్ల పైగా ఉప్పు కలిపిన మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలోని మంచి బ్యాక్టీరియా పై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతుంది.

ఆయుర్వేదంలో పెరుగుతో ప్రయోజనాలు, నష్టాలు..

పెరుగు పుల్లనిది, అలాగే ఆమ్ల పదార్థ కనుక ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఎన్నో ప్రయోజనాలను కూడా మన శరీరానికి అందిస్తుంది. దీనిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగును ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కఫం, పిత్తం పెరుగుతుంది. ఆరోగ్యానికి పాడు చేస్తుంది. దీనితో పాటు ఎసిడిటీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే మంచి బ్యాక్టీరియా ఎసిడిటీ ఏర్పడి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా చేటునే తెస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 01:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising