Share News

Year Ender 2023: పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ.. ఈ విషయాలను మాత్రం మరిచిపోకండి..!

ABN , Publish Date - Dec 25 , 2023 | 11:39 AM

శరీర ఆరోగ్యాన్ని అనారోగ్యకరమైన దిశగా నడిపించడమే కాకుండా, ఆందోళనను, నిరాశను పెంచే గుణాన్ని కలిగి ఉంది. అందుకే ఈ అలవాటును తగ్గించుకోవడం మంచిది.

Year Ender 2023: పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ.. ఈ విషయాలను మాత్రం మరిచిపోకండి..!
health

2023 సంవత్సరం చివరకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. చివరి కాలంలో జీవితం నేర్పిన పాఠాలను గుర్తుచేసుకునే సందర్భం, గడిచిన మంచి సమయాలు, మరిచిపోలేని మధురమైన అనుభూతులను గుర్తుచేసుకునే సందర్భం కూడా ఇదే. సంవత్సరం పెరిగేకొద్దీ, మెరుగైన జీవితాన్ని గురించి ప్రయత్నిస్తూనే, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై కొన్ని నిర్ణయాలను తీసుకునే సమయం కూడా ఇదే..

శారీరకంగా దృఢంగా..

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పని సరి. దీనికి వ్యాయామం కూడా తోడైతే రోజు మరింత ఉత్సాహంగా మారుతుంది. ఈ అలవాటు అటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మానసిక ఆరోగ్యం..

మానసిక ఆరోగ్యం గురించి సరైన అవగాహన అవసరం. ఏది మానసిక ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచుతుందో అటువంటి అలవాటును కొనసాగించేలా చూసుకోవాలి.

స్క్రీన్ సమయం..

స్క్రీన్ సమయాన్ని తగ్గించే ఆలోచన చేయడం చాలా అవసరం. మారుతున్న కాలానికి తగిన విధంగా సోషల్ మీడియాతో దగ్గరి సంబంధం కలిగి ఉంటున్నాం. అయితే సాంకేతికతను మరింత దుర్వినియోగం చేసే విధంగా స్క్రీన్ లతో ఎక్కువ సమయాన్ని గడపడం అనేది మానసిక,. శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

కఠినమైన నిర్ణయాలు..

సందర్భానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం తప్పదు. విమర్శలను తట్టుకునే ధైర్యం కావాలి. దయతో ఉండాలి.

మంచి అభిరుచులు..

ఒక అభిరుచిని ఎక్కువగా అనుసరిస్తున్నాం అంటే అది మేలుచేసిదిగా ఉండాలి. మానసిక, శారీరక ఆరోగ్యానికి సపోర్ట్ గా నిలిచే అభిరుచులను అనుసరించడం., అలవరుచుకోవడం అనేది చాలా అవసరం.

ఇది కూడా చదవండి: ఆరెంజ్ పండుతో కలిగే ఏడు ప్రయోజనాలు ఏంటంటే..!!


ధ్యానం..

మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలంటే ధ్యాన సాధన తప్పని సరి. ధ్యానం సాధన చేయడం వల్ల వర్తమానంలో మరింత స్థిరంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఆల్కహాల్..

ఆల్కహాల్ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగించేదే ఎక్కువ. శరీర ఆరోగ్యాన్ని అనారోగ్యకరమైన దిశగా నడిపించడమే కాకుండా, ఆందోళనను, నిరాశను పెంచే గుణాన్ని కలిగి ఉంది. అందుకే ఈ అలవాటును తగ్గించుకోవడం మంచిది.

నిద్రకు ప్రాధాన్యత..

హడావుడిగా రోజంతా పనిలో నిమగ్నమై కాలాన్ని గడిపేసే చాలా మందిలో కనిపించే సమస్య నిద్రలేమి. దీనిని అధికగమించేందుకు పూర్తి ప్రశాంతమైన నిద్రను పోవడమే పరిష్కారం. నిండైన నిద్ర ఆరోగ్యానికి మంచి చేస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. ప్రతి రోడూ దాదాపు ఎడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 11:41 AM