ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allergy Symptoms: ఈ ఐదు పదార్థాలను తీసుకుంటే చాలు.. శీతాకాలంలో వచ్చే అలెర్జీల నుంచి బయటపడ్డట్టే..!

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:33 AM

శీతాకాలంలో తుమ్ములు, దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు వచ్చేఅవకాశం ఉంది.

immune

మారుతున్న కాలానికి తగినట్టు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఇప్పటి శీతాకాలానికి తగినట్టు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శీతాకాలంలో చాలా రకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే సరైన జీవనశైలితో పాటు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోక తప్పదు. శీతాకాలంలో తుమ్ములు, దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు వచ్చేఅవకాశం ఉంది. అలెర్జీ లక్షణాలను మారుతున్న సీజన్‌లో దూరంగా ఉండే ఐదు ఆహార పదార్థాలు ఇవి.

పైనాపిల్: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన పైనాపిల్ తినడానికి తీయని రుచితో ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని, నాసికా రద్దీని తగ్గించడంలో సహకరిస్తుంది. సాధారణంగా అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఆకు కూరలు: బచ్చలికూర, కాలె వంటి ముదురు ఆకు కూరలు చాలా రకాల పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్లను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు అలెర్జీ రినిటిస్ ప్రమాదంతో తక్కువ సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఆకు కూరలను రోజు ఆహారంలో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలిగినట్టే.

ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్: పెరుగు, కేఫీర్, సౌర్ క్రాట్, ప్రోబయోటిక్ అధికంగా ఉండే సమతుల్య గట్ మైక్రోబయోమ్ ఆహారాలు, ఇవి అలెర్జీల నుంచి దూరంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: 40 ఏళ్ళ తర్వాత ఫిట్‌గా.. యవ్వనంతో ఉండాలంటే ఇవి తప్పక పాటించాల్సిందే..!


క్వెర్సెటిన్ ఫుడ్స్: కెర్సెటిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో ఉన్న సహజ సమ్మేళనం. ఇవి అలర్జీలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉల్లిపాయలు, యాపిల్స్, బెర్రీలలో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది.

తేనె: తేనె మన ఆహారంలో చాలా వరకూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఇందులో ఎక్స్పజర్ అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 14 , 2023 | 11:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising