Share News

Fitness For Woman: 40 ఏళ్ళ తర్వాత ఫిట్‌గా.. యవ్వనంతో ఉండాలంటే ఇవి తప్పక పాటించాల్సిందే..!

ABN , First Publish Date - 2023-11-18T13:45:36+05:30 IST

జానికి 40 తర్వాత కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా ఫిట్ గా ఉండచ్చు. కాకపోతే కాస్తంత శ్రమ పడాలి

Fitness For Woman: 40 ఏళ్ళ తర్వాత ఫిట్‌గా.. యవ్వనంతో ఉండాలంటే ఇవి తప్పక పాటించాల్సిందే..!
exercise

40 ఏళ్ళ వయసు దాటుతుందంటే చాలా మందిలో ముఖ్యంగా ఆడవారిలో ఆరోగ్యపరంగా కాస్త ఆందోళన అయితే తప్పనిసరిగా ఉంటుంది. మోనోపాజ్‌కి దగ్గర అవుతున్నామని, శరీరం మునిపటిలా యాక్టివ్‌గా ఉండదనే ఆలోచనలోనే ఉండిపోతారు. నిజానికి 40 తర్వాత కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా ఫిట్ గా ఉండచ్చు. కాకపోతే కాస్తంత శ్రమ పడాలి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలంతే..

ఫిట్‌గా మారాలంటే మాత్రం..

40 ఏళ్ళు నిండిన వారిలో యవ్వనానికి దూరం అవుతున్నామనే ఆలోచన వస్తూనే ఉంటుంది. అయితే యవ్వనంగా ఉండాలనే ఆలోచనతో బొటాక్స్, సర్జరీల మీద ఆధారపడటం కూడా తప్పే. దీనికి సులభమైన జీవనశైలి మార్పులు చాలా వరకూ సపోర్ట్ చేస్తాయి.

చురుకైన జీవన శైలి కోసం..

ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండడానికి చురుకైన జీవనశైలి మార్గాలను ఎంచుకోవాలి. ఈ విషయంలో ఏరోబిక్స్, స్ట్రైంగ్త్ ట్రైనింగ్,. యోగా కూడా సహాయపడతాయి. ఫిట్ గా ఉంచుతాయి.

ఆహారం, అలవాట్లు

ఫిట్‌గా ఉండటానికి తీసుకునే ఆహారం కూడా అంతే శక్తిని ఇచ్చేది, ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఫ్రోటీన్లు, విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఆహారంలో తీసుకోవాలి. చక్కెరలు, అధిక ఉప్పుకు దూరంగా ఉండి పరిమితంగా తీసుకోవాలి, ఇది ధీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల కలిగే లాభాలేంటంటే..!


మంచి నిద్ర

ఏ విధమైన ఒత్తిడి లేని మంచి నిద్ర కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖాన్ని కాంతి వంతంగా, నల్ల మచ్చలు లేకుండా చేస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల లోపు నిద్రపోయేలా ఫ్లాన్ చేసుకోవడం మంచిది.

ఒత్తిడి లేకుండా

ధ్యానం, లోతైన శ్వాస ప్రక్రియలు, యోగా వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి.

సూర్య కాంతి..

శరీరం ఫిట్ గా ఉండాలంటే బయట యవ్వనంగా ఆరోగ్యంగా కనిపించాలి. దీనికి సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి చర్యలను తీసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

Updated Date - 2023-11-18T14:14:34+05:30 IST